Advertisement
Google Ads BL

ఆమె నటనకు మంచి మార్కులు వేస్తున్నారు


‘జెంటిల్‌మెన్, నిన్నుకోరి’ చిత్రాలలో డీసెంట్ నటనతో క్యూట్ అభినయంతో అదరగొట్టిన నివేధా థామస్ టాలీవుడ్ కెరీర్ ఏమంత గొప్పగా లేదు. రెండు హిట్ చిత్రాలు చేతిలో ఉన్నప్పటికీ.... నివేధా థామస్‌కి స్టార్ హీరోలెవరు పిలిచి అవకాశాలివ్వలేదు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవ కుశ సినిమాలో నివేధా కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఆ సినిమా వలన ఆమెకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు కళ్యాణ్ రామ్ - కెవి గుహన్ కాంబోలో తెరకెక్కిన 118 అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కీలక పాత్రలో నటించింది.

Advertisement
CJ Advs

శుక్రవారం విడుదలైన 118 సినిమాకి పాజిటివ్ టాక్ పడింది. ఈ సినిమాలో నివేధా నటనను అందరూ పొగిడేస్తున్నారు. సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువైనప్పటికీ.. ఆద్య పాత్రలో నివేధా మంచి నటన కనబర్చిందని.. కథ అంతా ఆమె చుట్టూ తిరిగేది కావడంతో సినిమాలో ఆమెకు మంచి పాత్ర దొరికింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుందని అంటున్నారు. అందుకే నివేధా థామస్ కు స్క్రీన్ టైం తక్కువే కానీ.. ఆమె సినిమా విజయంలో బలమైన ముద్ర వేసిందని.... నటిగా తన ప్రత్యేకతను మరోసారి చాటుకుందని అంటున్నారు.

మరి ఈ సినిమాలో కీలక పాత్రలో మంచి నటనతో ఆకట్టుకున్న నివేధా థామస్ కి ఇప్పుడైనా టాలీవుడ్ మంచి పొజిషన్ కల్పిస్తుందో.. లేదంటే.. జై లవ కుశ తర్వాత మాయమై 118 సినిమాలో తేలినట్టు.. మళ్ళీ మాయమై ఎప్పుడు కనబడుతుందా అనే పరిస్థితులే ఉంటాయా అనేది చూడాలి. ఇకపోతే నివేధాలో మంచి నటీమణి దాగున్నప్పటికీ.. ఆమె హైట్ ఆమెకి మైనస్ అని అందుకే... నివేధా కి మంచి అవకాశాలు రావడం లేదని అంటున్నారు.

Good Response to Nivetha Thomas Acting in 118 Movie:

Nivetha Thomas gets Hit with 118 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs