అల్లు అర్జున్ కి ఆ హీరోయిన్ అంటే అంత ఇదెందుకో.... ఎందుకంటే తన సినిమాల్లో ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తూ వస్తున్నాడు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. ఇద్దరమ్మాయిలు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన కేథరిన్ థెరిస్సా. ఇద్దరమ్మాయిలు సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడులో కూడా యంగ్ ఎమ్యెల్యేగా అల్లు అర్జున్ ఇష్టపడే అమ్మాయిగా నటించింది. అలాగే అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేసిన రుద్రమదేవి సినిమాలోనూ కేథరిన్ నటించింది. తాజాగా మరోసారి బన్ని కేథరిన్ కి అవకాశం ఇవ్వబోతున్నాడనే న్యూస్ చూసిన వారు అల్లు అర్జున్ కి ఆ హీరోయిన్ అంటే అంత కెరెందుకో అంటున్నారు.
ఇప్పుడు బన్ని నాల్గవసారి కేథరిన్ తో నటించబోతున్నాడట. అది కూడా త్రివిక్రమ్ తో కలిసి చెయ్యబోయే సినిమాలో. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ల సినిమా ఏప్రిల్ కానీ, మేలో కానీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ గా అల్లు అర్జున్ గతంలో డీజేలో కలిసి నటించిన పూజాహెగ్డేని మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అలాగే మరో కీలక హీరోయిన్ పాత్రకి కేథరిన్ తెరిస్సాని తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే కేథరిన్ కి బన్ని ఎన్ని అవకాశాలిచ్చినా.. ఆమెకి మాత్రం హీరోయిన్ గా గుర్తింపు దక్కడం లేదు.
మరి ఈసారైనా కేథరిన్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంటుందో లేదో చూడాలి. ఇక కేథరిన్ విజయ్ దేవరకొండ సరసన కూడా నటిస్తుంది. మరి విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ల క్రేజ్ తో కేథరిన్ మరిన్ని అవకాశాలు చేజిక్కించుకుంటుందో.... లేదంటే మళ్ళీ డల్ అవుతుందో చూద్దాం.