కళ్యాణ్ రామ్ హీరోగా సినిమాలు చెయ్యడంలో ఎప్పుడూ బిజినే.. ఇక నిర్మతగా హీరోగా రెండు పడవల మీద కాళ్ళేసిన కళ్యాణ్ రామ్ కి అటు నిర్మాతగా.. ఇటు హీరోగానూ అస్సలు క్రేజ్ లేదు. అందుకే తమ్ముడు తారక్ చెప్పినట్టుగా ఇప్పుడు తన సినిమాలను తానే నిర్మించడం, ఇతర హీరోల సినిమాలను నిర్మించడం మానేసి హీరో కెరీర్ మీదే కాన్సంట్రేషన్ చేసాడు. కెరీర్ లో రెండే రెండు హిట్స్ తో ఉన్న కళ్యాణ్ రామ్ కి గత ఏడాది రెండు భారీ ప్లాప్స్ పడ్డాయి. కాజల్ తో జోడి కట్టిన ఎమ్యెల్యే ప్లాప్ కాగా.. తమన్నాతో కలిసి నా నువ్వే అంటే.. ప్రేక్షకులు వద్దు పొమ్మన్నారు. మరి హిట్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కి ఎట్టకేలకు పటాస్ తర్వాత 118 హిట్ పడింది.
నిన్న శుక్రవారం విడుదలైన 118 కి ప్రేక్షక స్పందన బావుంది. కళ్యాణ్ రామ్ - గుహన్ కలయికలో తెరకెక్కిన 118 సినిమాకి హిట్ టాక్ పడింది. సస్పెన్స్ థ్రిల్లింగ్ సబ్జెక్టుతో సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకుడిగా తీసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండే కాదు.. సినీ విశ్లేషకుల నుండి కూడా పాజిటివ్ మార్కులే పడ్డాయి. కథ రొటీన్ అయినా కథనం ఇంట్రెస్టింగ్ గా ఉండడం.. ఫస్ట్ హాఫ్ గ్రేసిగా ఉండడం, నేపధ్య సంగీతం ఆకట్టుకోవడంతో పాటుగా సినిమాకి సినిమాటోగ్రఫీ హైలెట్ అనేలా ఉండడంతో పాటు.. కళ్యాణ్ రామ్ లుక్స్, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా అద్భుతంగా ఆకట్టుకోవడంతో.. 118 కి పాస్ మార్కులు పడ్డాయి.
ఇక హీరోయిన్ లో నివేద థామస్ నటనతో అదరగొట్టగా.. షాలిని పాండే క్యూట్ లుక్స్ తో మెప్పించింది. మరి రొటీన్ స్టోరీ, రొటీన్ ఫ్లాష్ బ్యాక్, పూర్ క్లైమాక్స్, ఆసక్తి కరంగా ట్విస్టులు లేకపోవడంతో... 118 బ్లాక్ బస్టర్ హిట్ ని మిస్ చేసుకుందంటున్నారు. మరి చాన్నాళ్ళకి కళ్యాణ్ రామ్ కి కెవి గుహన్ 118 తో హిట్ అందించాడు. ఇక ప్రస్తుతం డల్ గా వున్న బాక్సాఫీసును కళ్యాణ్ రామ్ 118 తో సందడి చేసేలా చేసాడంటున్నారు. మరి ఈ సినిమాకి ప్రమోషన్స్ ని మరింతగా పెంచితే నిర్మాత మహేష్ కోనేరుకి మరిన్ని లాభాలొచ్చే ఛాన్స్ ఉంటుందని కూడా అంటున్నారు.