Advertisement
Google Ads BL

‘దుప్పట్లో మిన్నాగు’ టీజర్ వదిలారు


యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దుప్పట్లో మిన్నాగు’. చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‌సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రఖ్యాత కన్నడ కధానాయిక చిరాశ్రీ నటిస్తొంది. నవ్య వారపత్రికలో నవలల పోటీలో 50,000 ప్రథమ‌బహుమతి పొందిన దిండు కింద నల్ల త్రాచు నవల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది.‌ ఈ చిత్ర టీజర్‌ను పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి  ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను విచ్చేసిన అతిథుల చేత పదర్శించారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ..‌ ‘‘12 సం. క్రితం వచ్చిన ఓ చిన్న ఐడియాతో ఈ కథ రాయటం జరిగింది. ఓ ఇంటర్యూలో.. ఓ అర్దరాత్రి, నీ జెండర్ మారిపోతే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు.. ఓ అమ్మాయి చెప్పిన సమాధానం, అందులో ఉన్న డెప్త్‌ను అర్థం చేసుకుని ఈ కథను రాయటం జరిగింది. కాశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో అకస్మాత్తుగా తప్పిపొయిన తండ్రిని, ఓ కూతురు ఎలా వెతికి పట్టుకుంది. తీవ్రవాదులని ఎలా మట్టు పెట్టిందన్న కథాంశంతో రూపొందించిన చిత్రమిది. నిర్మాత..కె.ఎస్.రామారావు, మిత్రుడు కోదండ రామిరెడ్డి వారిరువురు రావటం సంతోషంగా ఉంది..’’ అన్నారు. 

కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. ‘‘దుప్పట్లో మిన్నాగు కథ చదివాను.‌ సినిమాగా చాలా అప్‌డేటెడ్‌గా యండమూరి గారు తీశారు. కాంటెపరరీ టెక్నిషియన్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా అడ్వాన్స్‌డ్‌గా తీశారు..’’ అన్నారు.

మేథా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘యండమూరిగారు ఈ సినిమాకు అన్నీ తానై తీశారు. రచయితగా, దర్శకుడుగా ఆయన ప్రూవ్డ్. సినిమా ఆకట్టుకుంటుంది అలాగే ఆలోచింప చేస్తుంది’’ అన్నారు.

దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘సినిమా చూశాను. అంతా బాగుంది.‌ ఇప్పుడున్న పరిణామాలకు కరెక్ట్‌గా సరిపోయే చిత్రం. ఆయన 12 నవలలు నేను సినిమాలుగా చేశాను. అవి అన్నీ హిట్టే. నాకు దర్శకుడిగా పేరు తెచ్చాయి.‌ గురువుగారి సినిమా బాగా ఆడాలని ఆశిస్తున్నాను..’’ అన్నారు. 

దర్శకులు అజయ్ మాట్లాడుతూ.. ‘‘యండమూరిగారి సినిమా అంటే మా సొంత సినిమా లెక్క. ‘దుప్పట్లో మిన్నాగు’ టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. యువ దర్శకులకు స్పూర్తిగా ఈ సినిమా మేకింగ్ ఉంటుంది ’’ అన్నారు‌.

నిర్మాత చల్లపల్లి అమర్ మాట్లాడుతూ.. ‘‘1992 నుంచి ప్రొడక్షన్‌లో ఉన్నాను. యాడ్ ఫిలింస్, డాక్యుమెంటరీలు చేస్తుంటాను. ‌ఇది మా తొలి చిత్రం. ఈ సినిమాను చాలా తక్కువ టైమ్‌లో తీశాం. అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. యండమూరిగారు నాకు స్పూర్తినిచ్చిన వ్యక్తి. ఈ రోజు ఆయనతో సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

హీరోయిన్ చిరాశ్రీ మాట్లాడుతూ.. ‘‘యండమూరి గారు ఇచ్చిన సపోర్ట్‌తో సినిమాను చాలా బాగా చేశాము. సార్ చాలా స్పోర్టీవ్’’ అన్నారు.

దశరధ్ మాట్లాడుతూ.. ‘‘గురువుగారి వల్లే నేను ఈ స్దాయికి‌ వచ్చాను.‌ ఆయన పుస్తకాలే నాకు స్పూర్తి. ‌ఈ కథ ఓ సూపర్ థ్రిల్లర్. అన్ని పాత్రలు ఎక్సెలెంట్‌గా ఉంటాయి. కమర్షియల్‌గా కూడా ఇది ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు..’’ అన్నారు.

సిరివెన్నెల సీతారామశాస్తి మాట్లాడుతూ.. ‘‘యండమూరిగారితో నాకు ఎప్పటినుంచో పరిచయం. తెలుగు తెలిసిన వారందరికి ఆయన తెలిసిన వ్యక్తి. సెలెబ్రిటీలు కూడా ఆయనకు అభిమానులు. ఆయన ప్రత్యేకమైన, పాపులర్ రచయిత. అన్ని తరహా పాఠకులకు ఆయన రచనా శైలీ నచ్చుతుంది. కథలో ఆసక్తికరంగా ఓ పాయింట్‌తో, అవసరమైన ఏదో ఒక విషయం ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. బేతాళ విక్రమార్కుడులా అందరికీ అవసరమయ్యేలా ఆయన కథలు చెపుతూనే ఉన్నాడు. ఇప్పుడు సినిమా చేస్తున్నారు. ఇది అంతే అర్థవంతంగా, కాంటెపరరీ ఇష్యూష్‌ను టచ్ చేస్తూ ఈ చిత్రాన్ని తీశారనిపించింది.‌ యండమూరి రచనకు నేను అభిమానిని. విశిష్టమైన రచయిత. నా ఆలోచనలకు ఇంథనం ఇచ్చే రచనలు ఆయనవి. ఇంకా ఎంతో పేరు రావాల్సిన రచయిత ఆయన. ఈ కథను నేను చదివాను. సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సుబ్బరాయశర్మ, శ్రీశైల మూర్తి పండరీనాధ్ తదితరులు పాల్గొన్నారు.

Duppatlo Minnagu Teaser Launched:

Duppatlo Minnagu Teaser released by Sirivennela Seetharama Sastri
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs