Advertisement
Google Ads BL

సిద్ధార్థ చిత్రం తెలుగులోకి అనువాదం


సిద్ధార్థ ‘ప్రేమాలయం’ పాటలు-ప్రచారచిత్రం విడుదల!

Advertisement
CJ Advs

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సిద్ధార్థ తమిళంలో నటించగా ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమాలయం’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో మరియు ట్రైలర్ విడుదల వేడుక హైద్రాబాద్ లోని ప్రసాద్ లాబ్ ప్రివ్యూ ధియేటర్‌లో ఘనంగా జరిగింది. మాణిక్యం ఆర్ట్ ధియేటర్స్ పతాకంపై శ్రీమతి పి.సునీత సమర్పణలో యువ నిర్మాత శ్రీధర్ యచ్చర్ల ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. వసంత బాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ సరసన వేదిక, అనైక సోఠి హీరోయిన్స్‌గా నటించగా.. మలయాళ టాప్ స్టార్ పృథ్వి రాజ్ ప్రతి నాయక పాత్ర పోషించారు. ప్రముఖ దర్శక నిర్మాత లయన్ సాయి వెంకట్ ముఖ్య అతిధిగా పాల్గొని ఆడియో బిగ్ సిడి, ట్రైలర్ ఆవిష్కరించి, నిర్మాత శ్రీధర్ కి శుభాకాంక్షలు తెలిపారు. వర్ధమాన నటి సోనియా, హుస్సేనప్ప పాటలు విడుదల చేశారు.

నిర్మాత శ్రీధర్ యచ్చర్ల మాట్లాడుతూ.. సిద్ధార్ధ హీరోగా నటించి.. ప్రపంచ ప్రఖ్యాత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చిన ‘ప్రేమాలయం’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అరుదైన అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉంది. వసంత్ బాలన్ దర్శకత్వ ప్రతిభ, సిద్దార్ధ, పృథ్విరాజ్, నాజర్‌ల నటన, వేదిక, అనైక సోఠిల గ్లామర్.. వనమాలి, కందికొండ అందించిన పాటలు, రాజశేఖర్ రెడ్డి మాటలు ‘ప్రేమాలయం’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. అన్నారు. 

నాజర్, మన్సూర్ అలీఖాన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నీరవ్ షా, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: శ్రీధర్ యచ్చర్ల, దర్శకత్వం: వసంత్ బాలన్.

Premalayam Movie Song Released:

Siddharth Tamil Movie Dubbed into Telugu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs