Advertisement
Google Ads BL

‘10 కోట్లు’ కోట్ చేసిన శంకర్..!


ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో హీరో రామ్ అండ్ పూరి ఇస్మార్ట్ శంకర్ స్టార్ట్ చేసారు. పాజిటివ్ వైబ్స్ మధ్య స్టార్ట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని మరో షెడ్యూల్ కోసం గోవా వెళ్లనుంది. ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ కోసం కొంతమంది టీవీ ఛానెళ్లు వాళ్లు టీంను సంప్రదించాయి. 

Advertisement
CJ Advs

అయితే శాటిలైట్ రైట్స్ క్లోజ్ చేసుకుంద్దాం అని వెళ్లిన ఛానెళ్లు వారికి గట్టిగా షాక్ ఇచ్చాడు పూరి. ఇస్మార్ట్ శంకర్ శాటిలైట్ రేటు చూసి టీవీ ఛానెళ్లు బెంబేలెత్తిపోతున్నాయి. 10 కోట్ల రూపాయలిస్తేనే శాటిలైట్ రైట్స్ ఇస్తామంటూ బేరం పెట్టారట మేకర్స్. డైరెక్టర్ పూరి, హీరో రామ్ ఇద్దరికీ మార్కెట్ అంతగా లేదు. వరసగా ప్లాప్స్ రావడంతో వారి మార్కెట్ కూడా పడిపోయింది. కానీ వీరు ఆ రేట్ చెప్పి బెదరగొట్టడం ఏంటని కామెంట్స్ చేస్తున్నాయి ఛానెళ్లు.

కేవలం శాటిలైట్ కే ఇంత చెపితే డిజిటల్ కు ఎంత చెబుతారో అని భయపడుతున్నారు. అయితే ఈ సినిమాను సంబంధం లేకపోయినా రామ్ పెద్దనాన్న స్రవంతి రవికిషోర్ ఛార్మితో కలిసి ఈ మొత్తం వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తుంది. మరి వీరికి ఈ సినిమాపై అంత కాంఫిడెన్స్ ఏంటో..

Ismart Shankar Wants 10 crores for Satellite Rights:

Shocking Satellite Rights to Ismart Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs