Advertisement
Google Ads BL

లిస్ట్‌లో వన్ అండ్ ఓన్లీ మహేష్ మాత్రమే..!


గత ఏడాది సమ్మర్‌లో అంటే మార్చి 30 న రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో బోణి కొట్టాడు. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మార్చి నెలాఖరున కూల్ గా వచ్చి అదరగొట్టే హిట్ ఇచ్చాడు రామ్ చరణ్... ఇక ఏప్రిల్ లో మహేష్ బాబు - కొరటాలశివ కాంబోలో తెరకెక్కిన భరత్ అనే నేను కూడా హిట్ అయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు కానీ.. నార్మల్ హిట్ అయ్యింది ఆ సినిమా. ఇక మరో స్టార్ హీరో అల్లు అర్జున్ మే మొదటి వారంలోనే నా పేరు సూర్య తో హడావిడి చేసాడు కానీ.. నా పేరు సూర్య అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక ముగ్గురు స్టార్ హీరోలు గత ఏడాది సమ్మర్ లో పోటీ పడితే... ఈ ఏడాది సమ్మర్ కేవలం ఒకే ఒక్క స్టార్ హీరోకి సొంతం కానుంది

Advertisement
CJ Advs

అది కూడా మహేష్ బాబుకి మాత్రమే. ఈ ఏడాది టాప్ స్టార్ ల సినిమాల్లో కేవలం మహేష్ బాబు మాత్రం ఈ వేసవిని ఉపయోగించుకున్నాడు. రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ.. ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు రారు. వారు నటిస్తున్న RRR సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరికి క్లారిటీ లేదు. ఇక అల్లు అర్జున్ నా పేరు సూర్య దెబ్బకి ఏడాది గడిచినా కొత్త సినిమా మొదలెట్టడం లేదు. ఇక ప్రభాస్ సాహో.. ఆగష్టు 15 న.. చిరంజీవి సై రా సినిమా కూడా ఆగష్టు లో అంటున్నారు.. కానీ దసరాకే పక్కా అవుతుందనిపిస్తుంది.

మరి వేసవిలో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలవడం అనేది సహజం. కానీ ఈసారి స్టార్ హీరోలంతా వేసవిని వదిలేశారు. వేసవి సెలవల్లో భారీ బడ్జెట్ సినిమాలను వదిలి బాగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు చాలామంది దర్శకనిర్మాతలు. మరి ఈ దసరా మహేష్ బాబు మహర్షి సినిమాతోనే ప్రేక్షకులు సరిపెట్టుకోవాలి. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహర్షి సినిమా మీద ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

Only Mahesh Babu Movie in List:

Only Mahesh babu movie in Summer List
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs