Advertisement
Google Ads BL

‘లవ్ 20-20’ లోగో విడుదల చేశారు


మోహన్ మీడియా క్రియేషన్స్‌లో మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల మరియు జో శర్మ, మెక్విన్  గ్రూప్ USA సహకారంతో వడ్లపట్ల సినిమాస్ సమర్పిస్తున్న చిత్రం లవ్ 20-20. ఈ చిత్రం ద్వారా అరవింద్, మోహిని (Miss Teen Canada 2012) హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర లోగోను శుక్ర‌వారం ఫిలిం ఛాంబ‌ర్‌లో విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

ఈ సంద‌ర్భంగా జరిగిన పాత్రికేయుల స‌మావేశంలో మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల మాట్లాడుతూ.. ‘‘నాలుగు నెల‌ల క్రితం నేను, సాగ‌ర్ అన్న క‌లిసి ఒక చిన్న ప‌ని మీద బెంగళూరు వెళ్లాము. అక్క‌డ సాగ‌ర్ అన్న ద్వారా నాకు సెంధిల్ ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆయ‌న అర‌గంట‌లో నాకు క‌థ చెప్పారు. క‌థ న‌చ్చి నేను వెంట‌నే ఓకే చేశాను. ఈ చిత్రంలో అంద‌రూ చాలా బాగా న‌టించారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. త‌ను ఇంత‌క ముందు ఇండియా మిస్‌టీన్‌లో 2012లో అవార్డును తీసుకున్నారు. 2011లో మిస్‌టీన్‌ యు.ఎస్‌.ఎలో పార్టిసిపేట్ చేశారు. ఈ చిత్రానికి మ్యూజిక్, కెమెరా అన్నీ బాగా కుదిరాయి. ఈ చిత్రం హిట్ కావాల‌ని, అందరూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

ద‌ర్శ‌కుడు వి. సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మోహ‌న్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. న‌న్ను ఇంత మంచి గొప్ప తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసినందుకు. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్..’’ అని అన్నారు.

లిరిక్ రైట‌ర్ కిట్టు మాట్లాడుతూ.. ‘‘నేను ముందుగా బెక్కం వేణుగోపాల్ గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకోవాలి. న‌న్ను మోహ‌న్‌గారికి ప‌రిచ‌యం చేసింది ఆయ‌నే. నేను గ‌తంలో హుషారు చిత్రంలో ఉండిపోరాదే సాంగ్ రాశాను. త‌ర్వాత ఈ చిత్రానికి అవ‌కాశం ఇచ్చిన మోహ‌న్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఈ టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు. 

మ్యూజిక్ డైరెక్ట‌ర్ స‌త్యన్ మాట్లాడుతూ.. ‘‘మోహ‌న్‌సార్‌కి, సాగ‌ర్‌సార్‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌స్తుతం నేను ఏమీ మాట్లాడ‌లేను. నా మ్యూజిక్ మాత్ర‌మే మాట్లాడుతుంది’’ అన్నారు. 

సాగ‌ర్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం చాలా మంచి ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంది. ప్ర‌స్తుతం ఉన్న స‌మాజంలో చాలా క్యారెక్ట‌ర్ ఉన్న చిత్ర‌మిది. అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది’’ అన్నారు.

భ‌గీర‌థ మాట్లాడుతూ.. ‘‘మోహ‌న్‌గారు చాలా కాలం నుంచి నాకు ప‌రిచ‌యం. సెంథిల్‌గారితో క‌లిసి చేస్తున్నాను. ఈ సినిమా ట్రెండ్ సెట్ట‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్’’ అని అన్నారు.

మ‌హేంద్ర వ‌డ్ల‌పట్ల మాట్లాడుతూ.. ‘‘తెలుగులో ఇదే నా మొద‌టి చిత్రం. ఈ చిత్రం త‌ప్ప‌కుండా హిట్ కావాల‌ని అంద‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఎం.ఆర్‌.సి. వ‌డ్ల‌పట్ల మాట్లాడుతూ.. ‘‘మోహ‌న్‌ను ఏ విష‌యంలోనైనా స‌రే క‌న్విన్స్ చేయడం చాలా క‌ష్టం. అలాంటిది ఆయ‌న క‌న్విన్స్ అయి ఇంత మందిని సెలెక్ట్ చేసుకుని సినిమా చేస్తున్నారంటే నా దృష్టిలో వీళ్ళంతా చాలా ఉద్ధండుల‌నే అర్ధం. మ‌హేంద్ర‌, మోహ‌న్ క‌లిసి సినిమా చేయ‌డం అంటే ఒక‌రకంగా చాలా అద్భుత‌మ‌నే చెప్పాలి. నేను 30ఏళ్ళ నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్నా నా త‌మ్ముడు అని చెప్ప‌డం కాదు కాని ఎక్క‌డా కూడా క‌న్విన్స్ అవ్వ‌డు. చిన్న సినిమా అని చూడ‌కుండా ద‌య‌చేసి అందరూ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

హీరోయిన్ మోహిని మాట్లాడుతూ.. ‘‘ఈ పాత్ర కోసం న‌న్ను సెలెక్ట్ చేసుకున్నందుకు డైరెక్ట‌ర్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. తెలుగులో ఇదే నా మొద‌టి డెబ్యూ చిత్రం. ఈ చిత్రంలో మ్యూజిక్ చాలా బావుంటుంది. మ్యూజిక్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా నా కృత‌జ్ఞ‌త‌లు’’ అన్నారు. 

ఆర్టిస్ట్ క్రాంత్‌రిసా మాట్లాడుతూ.. ‘‘ఆర్ట్ అనేది జీవితంలో చాలా గొప్ప‌ది. అది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఉండాలి. ఒక మ‌నిషి క‌ళ్ళు మ‌రో మ‌నిషి చేసే ప‌నుల‌ను చేయాల‌ని కోరుకుంటుంది. ఈ సినిమా చాలా అద్భుతంగా రావాల‌ని మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: సత్యన్, పాటలు: కిట్టూ విస్సాప్రగడ, సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్, ఎడిటింగ్: పొన్నవేల్, ఆర్ట్: ప్రభాకరన్, నిర్మాత: మోహన్ వడ్లపట్ల మరియు మహేందర్ వడ్లపట్ల, లైన్ ప్రొడ్యూసర్: వి. సాగర్, రచన, దర్శకత్వం: వి.ఎస్.

Love 20 20 Movie Logo Released:

Aravind, Mohini starring Love 20 20 Movie Logo Launched at Hyderabad film Chamber
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs