Advertisement
Google Ads BL

త్రివిక్రమ్ ఆపరేషన్‌లో ‘ఘాజీ బాబా’ లుక్


‘ఇప్పటికీ నా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయి నాన్న’ - ‘బొమ్మరిల్లు’ పతాక సన్నివేశంలో హీరో సిద్ధార్థ్ చెప్పే ఈ మాట ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుర్తుంటుంది. అబ్బూరి రవి కలం నుంచి వచ్చిన మాట ఇది. ఒక్క ‘బొమ్మరిల్లు’ చిత్రానికి మాత్రమే కాదు... ‘అతిథి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, కిక్, మిస్టర్ పర్ఫెక్ట్, పంజా, ఎవడు, కేరింత, చీకటి రాజ్యం, ఊపిరి, గూఢచారి’ తదితర చిత్రాలకు అద్భుతమైన సంభాషణలను అందించారు అబ్బూరి రవి. బొమ్మరిల్లు చిత్రానికి గాను ఉత్తమ రచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. రచయితగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన అబ్బూరి రవిని నటుడిగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు దర్శకుడు అడివి సాయి కిరణ్.

Advertisement
CJ Advs

‘వినాయకుడు’, ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కేరింత’ వంటి సెన్సిబుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గేరి.బి హెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. వినాయ‌కుడు టాకీస్ పతాకంపై వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా క‌ల్పిత కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ఎన్‌.ఎస్‌.జి క‌మాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది సాయికుమార్‌, ప్రధాన పాత్రల్లో ‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెత్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, మ‌నోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులుగా నటించారు. తీవ్రవాది ‘ఘాజీ బాబా’ పాత్రలో అబ్బూరి రవి నటించారు. సినిమాలో ఆయన ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆవిష్కరించారు.

అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే... అబ్బూ (అబ్బూరి రవి)ని విలన్ గా పరిచయం చేయడం. నేనూ, అబ్బూరి రవి కలిసి చదువుకున్నాం. నాకు ఇష్టమైన స్నేహితుడు. కాశ్మీరీ పండిట్‌ల సమస్య మీద సాయి కిరణ్ గారు సినిమా చేస్తున్నట్టు అబ్బూరి రవి నాకు ఐదారు నెలల క్రితం చెప్పాడు. సాయి కిరణ్ గారు కాశ్మీర్ లో నిజమైన పండిట్ కుటుంబాలను కలిసి, వాళ్ళను ఇంటర్వ్యూలు చేసి.. వాళ్ళ తాలూకూ నిజమైన కష్టాలను, బాధలను తెరకెక్కించడం అభినందనీయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నిజాలను మనం జనాలకి చెప్పాలి. సినిమాను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాకుండా నిజమైన భావాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాలనే ప్రతి ప్రయత్నం సక్సెస్ కావాలి. సక్సెస్ అయ్యి తీరాలి. అవుతుంది కూడా. ఈ సినిమా నిజంగా మంచి విజయం సాధించాలని, అలాగే సాయి కిరణ్ గారికి మంచి దర్శకుడిగా.. ఆ పేరు పెరగాలని కోరుకుంటున్నా. అబ్బూరి రవి నటుడిగా బిజీ అయితే.. రాయడం, దర్శకత్వం వహించడం మానవద్దు. చాలామంది రచయితలు నటులుగా మారిన తరవాత పెన్నులు పక్కన పెట్టారు. ఆ పని అబ్బూరి రవి చేయకూడని కోరుకుంటున్నా. సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

అబ్బూరి రవి మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌లో నా లుక్ త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల కావడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే.. నన్ను రచయితగా లాంచ్ చేసింది త్రివిక్రమే. నన్ను సినిమాలకు పరిచయం చేసిందీ తనే. ఇప్పుడు ఆర్టిస్టుగా పరిచయం చేసిందీ తనే. త్రివిక్రమ్ లేకుండా నా కెరీర్ గురించి మాట్లాడటం అనేది జరిగే పని కాదు. నా ప్రతి అడుగులోనూ త్రివిక్రమ్ ఉంటాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా... ఏం ఆలోచించినా.. తన సలహాలు నాకు ఉంటాయి. అడివి సాయి కిరణ్‌తో ‘కేరింత’ సినిమాకు వర్క్ చేశా. ప్రతిరోజూ ఉదయం పూజలు చేసుకుని, బొట్టు పెట్టుకుని బయటకు వచ్చే నన్ను టెర్రరిస్ట్ గా చూస్తాడని ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. (నవ్వుతూ) ఏదో పగ పెంచుకుని ఉంటాడు. ఊచకోత కోసే తీవ్రవాదిగా నన్ను చూపించాడు. ప్రేక్షకులందరికీ ఈ పాత్ర నచ్చుతుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు. 

అడివి సాయికిరణ్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమాలో అబ్బూరి రవిగారి లుక్ లాంచ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థాంక్స్. మాకు ఆయన టైమ్ ఇచ్చి, పిలిచి ఈ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమాపై పాజిటివ్ వైబ్స్ మమ్మల్ని ప్రతిచోటుకూ తీసుకు వెళుతున్నాయి. లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉందని త్రివిక్రమ్ గారు అన్నారు. అబ్బూరి రవిగారు ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు. ఘాజీ బాబా పాత్రలో నటించమని ఆయన్ను కన్వీన్స్ చేయడానికి నాకు మూడు నెలలు పట్టింది. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని నటించినందుకు ఆయనకు థాంక్స్’’ అన్నారు. 

అర్జున్ పండిట్ అనే ఎన్‌.ఎస్‌.జి క‌మాండోగా ఆది సాయికుమార్‌, ‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెత్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్,  మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌’. 

Trivikram Releases Ghazi Baba Look From Operation Gold Fish:

Abburi Ravi as Ghazi Baba in ‘Operation Gold Fish’
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs