Advertisement
Google Ads BL

మెగాభిమానులూ.. ఇది జరిగే పనేనా?


ప్రస్తుతం నేచురల్‌స్టార్‌ నాని తన 24వ చిత్రంగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రిమూవీ మేకర్స్‌ సంస్థలో నటించే చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘గ్యాంగ్‌లీడర్‌’ని పెట్టుకున్నారు. దీంతో నానిపై మెగాభిమానులు మండిపడుతున్నారు. ఆ టైటిల్‌ని రామ్‌చరణ్‌కి మాత్రమే వాడుకునే వీలుందని, కానీ నాని ఇలా చేయడం తప్పు అంటూ సోషల్‌మీడియా వేదికగా వారు ఆడిపోసుకుంటున్నారు. ఇక గతంలో హీరో శివాజీ కూడా చిరంజీవి ‘స్టేట్‌రౌడీ’ అనే టైటిల్‌ని పెట్టుకున్నాడు. నిజానికి వారసులు తమ తండ్రుల, ఇతర కుటుంబ సభ్యుల సినిమా హిట్‌ టైటిల్స్‌ని పెట్టుకుంటే మరింత భారంగా, అంచనాలు భారీగా ఏర్పడి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అదే వేరే హీరో అయితే కాస్తైనా ఆ భారీ అంచనాలకు బ్రేక్‌పడుతుంది. పవన్‌కళ్యాణ్‌ ఎవర్‌గ్రీన్‌హిట్‌ ‘తొలిప్రేమ’ టైటిల్‌ని వరుణ్‌తేజ్‌ వాడుకుని హిట్‌ కొట్టాడు. నాటికి వరుణ్‌తేజ్‌కి పెద్దగా ఫాలోయింగ్‌ లేదు కాబట్టి సరిపోయింది. 

Advertisement
CJ Advs

ఇక చిరంజీవి కెరీర్‌లో ‘మగధీరుడు’ చిత్రం డిజాస్టర్‌. దానిలోని ‘మగధీర’ని తీసుకుని రామ్‌చరణ్‌ ఇండస్ట్రీ హిట్స్‌ని తారుమారు చేశాడు. ఇలా ఏదీ మన చేతిలో ఉండదు. కథకి తగ్గ టైటిల్‌ అంటే ఏ టైటిల్‌నైనా వాడుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ మన అభిమానులు మాత్రం తమ హీరోల వారసులు పెట్టుకుంటేనే బాగుంటుందని వాదిస్తారు. నాటి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు పెట్టుకున్న ‘ఆరాధన’ చిత్రాన్ని చిరు పెట్టుకున్నాడు. మరోవైపు ఏయన్నార్‌ నటించిన ‘దేవదాసు, మజ్ను’ వంటి చిత్రాలను అక్కినేని వారసులే వాడుకున్నారు. 

ఇక ‘మజ్ను’ టైటిల్‌ని నాని, ‘శివ’ పేరుతో ‘నా పేరు శివ’ వంటి చిత్రాలు కూడా వచ్చి విజయం సాధించాయి. ఇక కొందరు మెగాభిమానులు చిరంజీవి నటించిన అతి పెద్ద బ్లాక్‌బస్టర్స్‌ టైటిల్‌ని ముందుగానే రిజిష్టర్‌ చేసి, ప్రతి ఏడాది రెన్యువల్‌ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది రాకపోయేదని సలహాలిస్తున్నారు. ఇక ఇలా చిరంజీవి టైటిల్స్‌ని బ్లాక్‌ చేయాలంటే ఆయన నటించిన ‘150’ చిత్రాలలో కనీసం 50, 60 టైటిల్స్‌ని రిజిష్టర్‌ చేసి వాటిని రెన్యువల్‌ చేసుకుంటూ వెళ్లాలి. మరి ఇది జరిగే పనేనా మెగాభిమానులూ..! 

This is not Possible to Mega Compound:

Gangleader Title Controversy.. Mega Fans Fired on Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs