Advertisement
Google Ads BL

మెగా హీరోలతో పోటీ పడితే చాలు హిట్టే..!


ప్రజలందరికీ ఏవో ఒక సెంటిమెంట్లు ఖచ్చితంగా ఉంటాయి. దేవుడిని నమ్మని నాస్తికులు కూడా కొన్ని విషయాలలో వాటిని ఆచరిస్తూ ఉంటారు. ఇక సినిమా వారికి మాత్రం సెంటిమెంట్ల విషయంలో ఎప్పుడు పెద్ద శ్రద్దే ఉంటుంది. అది కాకతాళీయంగా జరిగినా, యాదృచ్చికమైనా, నిజంగా జరిగినా వాటినే అనుసరిస్తూ వస్తున్నారు. తాజాగా నేచురల్‌ స్టార్‌ నాని తనకు ‘24’ వ నెంబర్‌తో ఉన్న సెంటిమెంట్‌ని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాజాగా అలాంటి సెంటిమెంటే మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ విషయంలో నిజమవుతోందని కొందరు అంటున్నారు. వారి వాదన ప్రకారం వరుణ్‌తేజ్‌కి ‘ఫిదా’ తర్వాత వచ్చిన భారీ హిట్‌ ‘తొలిప్రేమ’. ఈ చిత్రంతో మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ నటించగా, వినాయక్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఇంటెలిజెంట్‌’ పోటీ పడింది. 

Advertisement
CJ Advs

దాంతో వరుణ్‌తేజ్‌ తన చిత్రాన్ని ఒకరోజు ఆలస్యంగా థియేటర్లలోకి తెచ్చాడు. ఈ చిత్రం ఘనవిజయం సాధించగా, మెగామేనల్లుడు నటించిన ‘ఇంటెలిజెంట్‌’ డిజాస్టర్‌ అయింది. ఇక ఈ సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌గా వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు నటించిన ‘ఎఫ్‌ 2’ నిలిచింది. ఈ చిత్రానికి ఒక రోజు ముందు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌-బోయపాటిశ్రీనుల కాంబినేషన్‌లో రూపొందిన ‘వినయ విధేయ రామ’ విడుదలైంది. ఫలితం మాత్రం సేమ్‌ టు సేమ్‌. ఈ పోటీలో రామ్‌చరణ్‌ ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్‌గా నిలవగా, ‘ఎఫ్‌ 2’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అయింది. దీన్ని సెంటిమెంట్‌గా భావిస్తే మెగా కాంపౌండ్‌ హీరోలతోనే పోటీ పడి వరుణ్‌తేజ్‌ చిత్రాలు రిలీజ్‌ అయితే అవి బ్లాక్‌బస్టర్స్‌గా నిలుస్తాయనే వాదన మొదలైంది. భవిష్యత్తులో ఇది మరింత ముదిరి గట్టి సెంటిమెంట్‌గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదనే చెప్పాలి. 

ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో ‘వాల్మీకి’ చేస్తున్నాడు. ఇందులో నెగటివ్‌ షేడ్స్‌ ఉండి తర్వాత పాజిటివ్‌గా మారే పాత్రను వరుణ్‌తేజ్‌ చేస్తుండగా, శ్రీవిష్ణు మరో హీరోగా నటిస్తుండటం విశేషం. దీని తర్వాత వరుణ్‌తేజ్‌ వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెట్టుకుంటున్నాడని తెలుస్తోంది. 

New Sentiment to mega prince varun Tej:

Lucky sentiment to Varun Tej in Mega Compound
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs