Advertisement
Google Ads BL

చైతూ, సామ్ గ్యారంటీగా కొడతారంట!


నాగ చైతన్య - సమంత పెళ్లి తర్వాత మొదటిసారిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటించారు. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మజిలీ సినిమా ఏప్రిల్ 5 న విడుదలకాబోతుంది. బయట భార్య భర్తలైన చైతూ - సామ్ లు మజిలీ సినిమాలోనూ భార్య భర్తలుగానే నటించారు. ఈ సినిమాలో నాగ చైతన్య క్రికెటర్ గా ప్రేమలో ఓడిపోయిన ప్రేమికుడిగా.. అలాగే ప్రేమించిన అమ్మాయి మీద ప్రేమను చంపుకోలేక... భార్యతో అడ్జెస్ట్ కాలేక రఫ్ గా ఉండే క్యారెక్టర్  చేసాడు. ఇక సమంత, చైతూని పెళ్లి చేసుకుని సాధారణ గృహిణిలా.. భర్తను వెనకేసుకొచ్చే భార్య పాత్రలో నటించింది.

Advertisement
CJ Advs

అయితే మజిలీ సినిమాలో ఈ భార్య భర్తలు మధ్య వచ్చే సన్నివేశాలే కీలకం అని చెబుతుంది మజిలీ చిత్ర బృందం. ఈ సినిమాలో చైతు క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందట. అలాగే చైతు కెరీర్ లోనే ఇలాంటి క్యారెక్టర్ ఇదివరకూ ఎప్పుడు చెయ్యలేదని.. ఇంకా ఈ సినిమాలో సమంతతో పెళ్లి అయ్యాక చైతూకి సంబంధించిన సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఒక అమ్మాయి కారణంగా చైతూ లైఫ్ ఎలా మారుతుంది... పెళ్లి తర్వాత కూడా అమ్మాయిని మర్చిపోలేక భార్యతో గడపలేక.. భార్యని దూరం పెట్టే క్యారెక్టర్ లో చైతూ నటన అద్భుతంగా ఉందంటున్నారు.

మరి శివ నిర్వాణ మొదటి చిత్రం నిన్నుకోరి సినిమాలోనూ... ప్రేమికులుగా విడిపోయి... తర్వాత ప్రేమికురాలు మరొకరిని పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఆమె పెళ్లి లైఫ్ లో హ్యాపీగా లేదని.. అందుకే భర్తని వదిలి వచ్చేయమంటే.. ఆ ప్రేమికురాలు తన భర్తతో తనెంత సంతోషంగా ఉంటున్నానో.. ప్రేమికుడికి చూపించే సన్నివేశాలు నిన్నుకోరి సినిమాకి హైలెట్. మరి ప్రేమికులుగా నాని - నివేద, భర్తగా అది పినిశెట్టి ఆ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకున్నారు. ఇక శివ తన రెండో సినిమాని నిన్నుకోరి సినిమాకి రివర్స్ లో చేసాడనిపిస్తుంది. మరి మజిలీ టీజర్ పోస్టర్స్ చూస్తుంటే మాత్రం సినిమాలో మంచి విషయం ఉందనిపిస్తుంది. ఈసారి చైతూకి హిట్ గ్యారెంటీ అనిపిస్తుంది.

Full positive vibes on Majili:

Naga Chaitanya and samantha Full Hopes on Majili Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs