Advertisement
Google Ads BL

డ్యామేజ్ అయ్యాక ఈ ఆలోచనలేంటి బాలయ్యా?


గత ఏడాది భారీ బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ షూటింగ్ మొదలు పెట్టుకున్న రామారావు గారి జీవిత చరిత్ర... భారీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లో పిచ్చ ఆసక్తిని క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ బయోపిక్‌ని దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణలు కలిసి రెండు పార్టులుగా తీద్దామని డిసైడ్ అయ్యి.. కథానాయకుడు, మహానాయకుడిగా ఎన్టీఆర్ జీవితాన్ని విభజించారు. ఇక కథానాయకుడు ప్రమోషన్స్‌తో పాటుగానే మహానాయకుడు ప్రమోషన్స్‌ని ఎన్టీఆర్ బయోపిక్ టీం పర్ఫెక్ట్ గా చేసింది. అందుకే కథానాయకుడు విడుదల సమయానికి ఆ సినిమా మీద అంతగా భారీ అంచనాలు ఏర్పడింది. కానీ ఆ అంచనాలు కథానాయకుడు అందుకోలేకపోయింది. 

Advertisement
CJ Advs

ఇక మహానాయకుడుకి ఎన్టీఆర్ టీం ప్రమోషన్స్ చెయ్యలేదు. మరి ఎన్టీఆర్ బయోపిక్ పీర్ టీం వైఫల్యమో.. లేదంటే అసలే క్రేజ్ లేదు ప్రమోషన్స్‌కి దండగ ఖర్చని మానేశారో.. మహానాయకుడు వచ్చి వారమైనా ఎక్కడా చడీ చప్పుడు లేదు.  కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టుగా.... ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కథానాయకుడు, మహానాయకుడు పోవడానికి అనేక కారణాలున్నాయి. కథానాయకుడులో ఎన్టీఆర్ ని దేవుడిగా చూపిస్తే.. మహానాయకుడులో చంద్రబాబుని దేవుడిగా చూపించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే రెండు సినిమాలకు తగిన శాస్తి చేశారు.

అయితే ఎన్టీఆర్ బయోపిక్ అంత ఘోరంగా ప్లాప్ అవడానికి గల కారణం చిత్ర బృందానికి క్లారిటీ రావడం లేదట. అందుకే ఆ కారణం కనుక్కోవడానికి ఎన్టీఆర్ టీం ఇప్పుడు రంగంలోకి దిగిందట. ఎన్టీఆర్ కి భార్యతో ఉన్న అనుబంధాన్ని చూపించినా.. ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు అంటే... ఎన్టీఆర్ జీవితంలో ఎంతో కీలకమైన చివరి ఘట్టాన్ని మాత్రమే ప్రేక్షకులు చూడాలనుకున్నారు.  కానీ దాన్ని దాచేసి తోచింది తీస్తే ఇలానే ఉంటుందనే విషయం ఎన్టీఆర్ టీంకి అర్ధమే కాకపోవడం శోచనీయమే. ఇంత డ్యామేజ్ అయ్యాక ఇప్పడు కారణాలు కోసం బయలు దేరితే.. ఒరిగేదేమిటి బాలయ్యా.. ఆలోచించు. 

Balakrishna Takes Sensational Decision after NTR Biopic Flop:

Balakrishna and NTR Team Searching for Reasons of NTR Flop
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs