Advertisement
Google Ads BL

‘సైరా’ అప్‌డేట్: మెగా ఫ్యాన్స్‌కి పండగే..!


మెగాస్టార్ చిరంజీవి - సురేందర్‌రెడ్డి కాంబోలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కతున్న సై రా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది. నిన్నమొన్నటివరకు సై‌రా సినిమా రీ షూట్స్ అంటూ.. అలాగే సినిమా విడుదల ఆలస్యం అంటూ అనేకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి. ఇక నిర్మాత రామ్ చరణ్ కూడా సై రా నరసింహారెడ్డి సినిమా దసరాకి విడుదలవుతోంది అని కాస్త డౌట్ ఫుల్ గానే చెప్పాడు. ఇక రీ షూట్స్ చెయ్యడానికి అంత బడ్జెట్ లేదంటూ కబుర్లు చెప్పినా.. మధ్యమధ్యలో మీడియాలో సై రా షూటింగ్‌పై వార్తలొస్తూనే ఉన్నాయి.

Advertisement
CJ Advs

ఇక తాజాగా సై రా సినిమా షూటింగ్ బీదర్ లో ఆగిపోయిందని నిరాశ చెందిన మెగాభిమానులను ఖుషి చేసేలా సై రా నరసింహారెడ్డి టీమ్ ఓ వార్తను విడుదల చేసింది. ఈ సినిమా ఆగష్టు‌లోనే విడుదలవుతుందనేది న్యూస్. మార్చి మొదటివారంలో సై రా లోని కీలకపాత్రలు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తే... సై రా షూటింగ్ పూర్తవుతుందని చెబుతున్నారు. ఇక షూటింగ్ పూర్తయిన  వెంటనే పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని.. తెలుస్తుంది. అయితే నేషనల్ వైడ్ గా పలు భాషల్లో తెరకెక్కుతున్న సై రా సినిమా పబ్లిసిటీ విషయంలో కానీ.. సినిమా విడుదల డేట్‌పై కానీ... క్లారిటీ ఇవ్వకుండా తాత్సారం చేస్తే.. ఈలోపు.. బాలీవుడ్ నుండి భారీ మూవీస్ బరిలోకి దిగితే సై రా సినిమాకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది.

అందుకే సై రా టీం ఇప్పుడు పక్కా వ్యూహంతో సై రా షూటింగ్ కంప్లీట్ చేసేసి... సినిమా విడుదల డేట్ పై అతి త్వరలోనే క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట. కాకపోతే బయట సోషల్ మీడియాలో మాత్రం సై రా సినిమా ఆగష్టు లోనే రాబోతుందని ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే సై రా సినిమా ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు వస్తే మెగా ఫ్యాన్స్ కి పండగే. అసలే రంగస్థలం తర్వాత మెగా ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. మెగా హీరోల్లో స్టార్ హీరోలైన అల్లు అర్జున్ నా పేరు సూర్య పోవడం తర్వాత మళ్ళీ మెగా బడ్జెట్ మూవీ ఏది విడుదల కాకపోవడంతో.. కాస్త డీలా పడిన మెగా ఫ్యాన్స్ కి.. ఇప్పుడు బయటికొచ్చిన సై రా న్యూస్ కిక్కెక్కిస్తోంది.

Sye Raa Movie shooting update:

Sye Raa Movie Shooting Near to Wrap
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs