Advertisement
Google Ads BL

ప్రియమణికి పర్‌ఫెక్ట్ రీ ఎంట్రీ అంటున్నారు


చిక్ మంగుళూరులో ప్రియమణి నటిస్తున్న ‘సిరివెన్నెల’ సాంగ్ షూటింగ్ 

Advertisement
CJ Advs

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని... తనదైన విభిన్నమైన పాత్రలతో మెప్పించిన ప్రియమణి... తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో కూడా నటించి అభిమానుల్ని సంపాదించుకుంది. పెళ్లి చేసుకొని కొంత గ్యాప్ తీసుకొని... సిరివెన్నెల అనే తెలుగు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన లభించింది. హైదరాబాద్‌లో జరిగిన షూటింగ్‌తో టాకీ పార్ట్ పూర్తి చేశారు. ప్రస్తుతం చిక్ మంగుళూరులో సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ పాటతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఏ‌ఎన్‌బి కోర్డినేటర్స్ బ్యానర్ పై ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్లాసిక్ టైటిల్ ‘సిరివెన్నెల’ అనే పేరు పెట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు... జూనియర్ మహానటిగా మంచిపేరు తెచ్చుకున్న సాయి తేజస్విని, బాహుబలి చిత్రంలో కిలి కిలి భాషతో భయంకరమైన విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత భాషా మాట్లాడుతూ.. ‘‘ప్రియమణిగారు చాలా కథలు విన్నప్పటికీ ‘సిరివెన్నెల’ కథ బాగా నచ్చడం... పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకుంది. ప్రియమణికి పర్‌ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీగా సిరివెన్నెల ఉండనుంది. మా బ్యానర్ కు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది. సిరివెన్నెల అనే టైటిల్ మా సినిమాకు పర్ ఫెక్ట్ యాప్ట్ టైటిల్. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిక్ మంగుళూరులో సాంగ్ షూటింగ్ చేస్తున్నాం. దీంతో చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. కమల్ గారు, సీత గారి సపోర్ట్ తో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం..’’ అని అన్నారు. 

డైరెక్టర్ ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ.. ‘‘సిరివెన్నెల మూవీ టాకీ పార్ట్ ఇటీవలే పూర్తయ్యింది. బ్యాలెన్స్ ఉన్న సాంగ్ ని చిక్ మంగుళూరులో ఫినిష్ చేస్తున్నాం. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోంది. కె విశ్వనాథ్‌గారు సిరివెన్నెల అనే గొప్ప సినిమా తీశారు. ఆ సినిమా టైటిల్ మేం పెట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. అయితే మా సినిమా జోనర్ వేరు. కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ సిరివెన్నెల. కొంత గ్యాప్ తర్వాత ప్రియమణి గారు మా సినిమా చేస్తున్నారు. ఆమె కొత్త లుక్‌లో కనిపిస్తారు. థ్రిల్లర్ హార్రర్ జోనర్‌లో ఈ సినిమా ఉంటుంది. కాలకేయ ప్రభాకర్ విలన్‌గా నటిస్తున్నారు. మహా నటి ఫేమ్ సాయి తేజ మంచి పాత్ర చేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. మా షూటింగ్ ఇంత బాగా జరిగిందంటే మా నిర్మాతలు కమల్, భాషా, రామ్ సీతా గారి వల్లే..’’  అని అన్నారు.

Priyamani Re-entry film Latest Update:

Priyamani Sirivennela Movie in Last Song Shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs