ఒక ప్లాప్ వస్తే జీవితం ఎలా మారిపోతుందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఓడలు బళ్లవుతాయి, బళ్లు ఓడలవుతాయి అంటే బహుశా ఇదేనేమో. ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలు అందించిన బోయపాటి.. రామ్ చరణ్‌తో తీసిన ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అవ్వడంతో తన ఫేట్ మొత్తం మారిపోయింది. ఈ సినిమా నిర్మాతలు - బోయపాటికి మధ్య వివాదాలు చెలరేగాయి. ఇప్పుడు బోయపాటితో సినిమా చేద్దాం అని డిసైడ్ అయిన కొంత మంది నిర్మాతలు అడ్వాన్స్ లు వెనక్కి ఇవ్వాలని కూర్చున్నారు.
వివరాల్లోకి వెళ్తే....బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి బాలయ్యే నిర్మాత. ‘వినయ విధేయ రామ’ ప్లాప్ అవ్వడంతో బోయపాటి రెమ్యూనరేషన్‌లో కోత పడింది. మరోవైపు బోయపాటి మైత్రీ మూవీస్‌తో ఓ సినిమా చేయడానికి బోయపాటి ఇది వరకే అడ్వాన్సు తీసుకున్నాడు. సరైనోడు సమయంలోనే మైత్రీ అడ్వాన్సు ఇచ్చింది.
అయితే ఇంతవరకు ఈ బ్యానర్ లో సినిమా సెట్ అవ్వలేదు. బోయపాటి ఎప్పుడు చేద్దాం అన్న వారికి ఓకేనే. అయితే ‘వినయ విధేయ రామ’ ప్లాప్ అవ్వడంతో వారు కొంచం జాగ్రత్త పడ్డారు. డైరెక్ట్ గా అడ్వాన్స్ అడగకుండా ‘మా సినిమా ఎప్పుడు చేస్తావ్’ అని అడుగుతున్నారట. విషయం అర్ధం చేసుకున్న బోయపాటి ఆ అడ్వాన్సుని వెనక్కి తిరిగి ఇచ్చేసి, ఎగ్రిమెంట్‌ని క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. ఇక బోయపాటి చేతిలో గీతా ఆర్ట్స్ అడ్వాన్స్ కూడా ఉంది. మరి దీని మాటేమిటో...