Advertisement
Google Ads BL

మోసగాడు: కౌశల్ ఆర్మీ రివర్స్ గేర్..!


గత ఏడాది ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మొదలైన బిగ్ బాస్ సీజన్ టు మధ్యలో కౌశల్ ఆర్మీ అంటూ బయట ఒక ఆర్మీ ఫామ్ అయ్యి.. హౌస్ లో ఉన్న కౌశల్ ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో చేసిన హంగామాతో .... ఎటువంటి అర్హతలు లేని కౌశల్ బిగ్ బాస్ విన్నర్ గా అవతరించిన సంగతి తెలిసిందే. తోటి కంటెస్టెంట్స్ తో మైండ్ లెస్ గేమ్ తో.. కేవలం కౌశల్ ఆర్మీ తోనే గెలుపొందిన కౌశల్ హౌస్ లోనే కాదు.. బయట కూడా బిగ్ బాస్ విన్నర్ గా వీర విహారం చేసాడు. హౌస్‌లో ఒంటరిని అనే బిల్డప్ తోనే కౌశల్ గెలుపొందాడు. ఒకానొక టైం లో బిగ్ బాస్ యాజమాన్యం కూడా కౌశల్ ఆర్మీ ట్రోలింగ్ కి భయపడి అతనికి టైటిల్ ఇచ్చేసిందనే టాక్ సోషల్ మీడియాలో నడిచింది. ఇక కౌశల్ ఆర్మీ ఫెక్ ఆర్మీ అంటూ తోటి కంటెస్టెంట్ బయటికొచ్చాక మొత్తుకున్నా... కౌశల్ మాత్రం నోరేసుకుని పడిపోయేవాడు.

Advertisement
CJ Advs

ఇక బిగ్ బాస్ విన్నర్ గా బయటికొచ్చాక కూడా బోలెడంత బిల్డప్ ఇస్తూ.. కౌశల్ ఆర్మీ పేరుతో హడావిడి చెయ్యడమే కాదు.. బిగ్ బాస్ టైటిల్ ని ఉపయోగించుకోవాలని చాలా తాపత్రయ పడ్డాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా రెండు మూడు షాప్ ఓపెనింగ్స్ కి పిలిచిన షాప్ యజమానులు తర్వాత్తర్వాత కౌశల్ ని పట్టించుకోలేదు. ఇక తనకి పిఎంఓ కార్యాలయం నుండి ఫోన్ వచ్చేదని.. అలాగే గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారని తెగ బిల్డప్ ఇచ్చాడు. ఇక కౌశల్ ఆర్మీని చూసి రెచ్చిపోయిన కౌశల్ కి ఇపుడు కౌశల్ ఆర్మీ షాకిచ్చింది. కౌశల్ ఆర్మీ స్వయానా కౌశల్ మోసగాడని, తన స్వార్ధం కోసమే పని చేస్తాడు కానీ.. ఎవరికీ ఉపయోగపడే మనస్తత్వం కాదని.. కౌశల్ వలన తాము నష్టపోయామని ఛానల్స్ సాక్షిగా మొత్తుకుంటున్నారు.

కానీ కౌశల్ మాత్రం తాను బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉన్నానో... ఇప్పుడు అలానే ఉన్నానని.. ఎప్పుడూ తనకి తానులా ఉన్నానని.. కానీ కావాలనే కొందరు తన ప్రతిష్టని కిందకి దిగజార్చే ప్రయాణం చేస్తున్నారని.. కౌశల్ ఆర్మీలోనే కొందరు కావాలనే తన మీద లేనిపోని నిందలు వేస్తున్నారని... నాలో ఏ మార్పులేదు.. నా వ్యక్తిత్వంలో ఏ మార్పు లేదని వాదిస్తున్నాడు కౌషల్. మరి షో లో యాంకర్ దీప్తిని, అలాగే నందిని ని ఉపయోగించుకుని.. తర్వాత నాకు నేనుగా పైకి వచ్చానని... తన కుటుంబమే తన బలమంటూ బిల్డప్స్ ఇచ్చి.. కౌశల్ బయట కూడా అదే కంటిన్యూ చేసాడు. అయితే గోగినేని బాబు లాంటి వాళ్ళు కౌశల్ ఆగడాలు హౌస్ లోపల, బయట కూడా ఎండగడుతూనే ఉన్నారు.

Shock: Kaushal Army Fires on Kaushal:

Kaushal Fraud Says His Army
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs