Advertisement
Google Ads BL

విషయం వేరు.. అయినా ఆగని పుకార్లు!


ఏ ముహూర్తాన ‘బాహుబలి’ చిత్రం చారిత్రక విజయం సాధించిందో గానీ అప్పటికే ‘బిల్లా, మిర్చి’ చిత్రాలతో పాటు ‘బాహుబలి’ రెండు పార్ట్‌లలో కలిసి నటించిన ప్రభాస్‌-అనుష్కల మీద పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వారిద్దరు లవర్స్‌ అని, వారి వివాహం త్వరలోనే జరగనుందని, అందుకే ఇప్పటివరకు ప్రభాస్‌-అనుష్కలు వివాహం చేసుకోలేదనే వార్తలు హల్‌చల్‌చేస్తున్నాయి. ఈ విషయంలో అనుష్క సైతం మండిపడి ఇకపై ఇలాంటి వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ప్రకటించింది. 

Advertisement
CJ Advs

ఇక ప్రభాస్‌ ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో బాహుబలిలో అనుష్క తనకి జోడీగానే కాదు.. తల్లిగా కూడా నటించిందని, అలాంటి ఆవిడను నేనెలా వివాహం చేసుకుంటానని ప్రశ్నించినా ఈ పుకార్లు ఆగలేదు. ఇక తాజాగా ప్రభాస్‌-అనుష్కలు కలిసి జపాన్‌ వెళ్లనున్నారు. దాంతో ఈ జంట ప్రేమ పక్షుల వలే జపాన్‌కి ఎంజాయ్‌ చేయడానికి వెళ్తున్నారంటూ మరలా వార్తలు వండి వారుస్తున్నారు. అయితే ఈ జంట జపాన్‌కి వెళ్లడం వెనుక మరో విషయం దాగుంది. ప్రభాస్‌-అనుష్కలు నటించిన ‘బాహుబలి’ చిత్రం మనదేశంలోనే కాదు జపాన్‌లో కూడా భారీ విజయం సాధించింది. అక్కడ ప్రభాస్‌-అనుష్కల జోడీకి మంచి ఇమేజ్‌ ఏర్పడింది. దీంతో డార్లింగ్‌ ప్రభాస్‌ నటించిన పలు పాత చిత్రాలను కూడా జపాన్‌లో డబ్‌ చేసి విడుదల చేస్తున్నారు. 

ఇందులో భాగంగా ‘డార్లింగ్‌, మిర్చి’ చిత్రాలు జపాన్‌లో విడుదల కానున్నాయి. మార్చి2వ తేదీన ‘మిర్చి’ చిత్రం స్క్రీనింగ్‌ జపాన్‌లో జరుగుతోంది. అందుకే ప్రభాస్‌-అనుష్కల జంట జపాన్‌లో ‘మిర్చి’ చిత్రం ప్రమోషన్స్‌ కోసం అక్కడికి వెళ్లనున్నారు. దీంతో విషయం తెలియని చాలా మంది ప్రభాస్‌ - అనుష్కలు కలిసి జపాన్‌ వెళ్లే విషయానికి మసాలాలు అంటుతూ ప్రచారం చేస్తున్నారు. మరి ఇలాంటి పుకార్లకు చెక్‌ పడాలంటే ప్రభాస్‌, అనుష్కలు విడివిడిగా వీలైనంత త్వరగా వివాహం చేసుకుంటేనే మంచిదని చెప్పాలి.

Prabhas, Anushka’s Mirchi, Darling Screening In Japan:

Prabhas, Anushka Flying To Japan, What’s Up?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs