ప్రస్తుతం ఇండియా - పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పుల్వామా దాడిలో 40 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ దొంగ చర్యలకు జవాన్లు ప్రాణాలు పోయాయి. పాకిస్తాన్ పిరికిపంద చర్యను ఇండియాలోని చిన్న పెద్ద అంతా వ్యతిరేకిస్తున్నారు. అయితే పాకిస్తాన్ పై అవకాశం చూసుకుని దాడి చేసేందుకు ఇండియన్ ఆర్మీ గత పన్నెండు రోజులుగా సన్నద్ధం గానే ఉంది. తాజాగా టైం చూసి పాకిస్తాన్ పై ఇండియా కక్ష తీర్చుకుంది. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసి జైషే ఉగ్రవాదులైన మూడు వందల మందిని మట్టుబెట్టింది ఇండియన్ వాయి సేన. భారత వైమానిక దళం ఈ రోజు తెల్లవారు ఝామున 3:30 నిమిషాలకు పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై 12 మిరాజ్ 2000 జెట్ ఫైటర్స్ తో 1000కిలోల బాంబులతో దాడులు జరిపింది.
అయితే భారత వైమానిక దళం చేసిన ఈ సహస చర్యను ఇండియాలోని ప్రతి ఒక్కరూ స్వాగతించడమే కాదు... ఇండియన్ ఆర్మీని వేయినోళ్ల కొనియాడుతున్నారు. ఇక అందులో టాలీవుడ్ ప్రముఖులు కూడా భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ ట్వీట్స్ చేస్తుంది. అందులో ప్రముఖంగా రాజమౌళి, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, అఖిల్, వరుణ్ తేజ్ తదితరులు ఉన్నారు.
మహేష్ బాబు: భారత వైమానిక దళం చేసిన ఈ పని దేశానికే గర్వ కారణం.
జూనియర్ ఎన్టీఆర్: ఇండియా సరైన సమాధానం పాకిస్తాన్ కి ఇచ్చింది. ఇండియన్ ఆర్మీని చూస్తే గర్వంగా వుంది.
రాజమౌళి: సెల్యూట్ ఇండియన్ ఆర్మీ.. జై హింద్ అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు.
రామ్ చరణ్: భారత వైమానిక దళం చూసి గర్విస్తున్నాం.. జై హింద్