Advertisement
Google Ads BL

‘దుర్మార్గుడు’పై సుమన్ ప్రశంసలు


బేబీ ఆరాధ్య సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాజవంశీ నిర్మించిన చిత్రం ‘దుర్మార్గుడు’. విజయ్‌ కృష్ణ, ఫిర్దోస్‌ భాను హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సునీల్‌ జంపా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను ప్రముఖ హీరో సుమన్‌ విడుదల చేశారు. ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్‌, బెక్కం వేణుగోపాల్‌, బిగ్‌ సీడిని హీరో సుమన్‌ నిర్మాత సి.కళ్యాణ్‌, బెక్కం వేణుగోపాల్‌, టి. రామ సత్యనారాయణ సంయుక్తంగా విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ముఖ్య అతిథి హీరో సుమన్‌ మాట్లాడుతూ.. ‘‘శ్రావణ భార్గవి పాడిన ప్రోమో సాంగ్‌ హార్ట్‌ టచింగ్‌గా ఉంది. లిరిక్స్‌ కూడా అద్భుతంగా కుదిరాయి. హీరో విజయ్‌కృష్ణ మొదటి సినిమా అయినా బాడీ లాంగ్వేజ్‌ చాలా చక్కగా ఉంది. డైరెక్టర్‌ పనితనం కనపడుతుంది. తక్కువ బడ్జెట్‌ సినిమా అయినా విజువల్స్‌ చాలా బాగున్నాయి. అందుకు డి.ఓ.పి మల్లిక్‌ని అభినందిస్తున్నాను. హీరోయిన్‌ చాలా అందంగా ఉంది. మొదటి సినిమాకే మంచి పెర్‌ఫార్మెన్స్‌ చేసే అవకాశం లభించింది. చిన్నికృష్ణ మ్యూజిక్‌ కూడా చాలా బాగుంది. సినిమా ఫుల్‌ ప్యాకేజీలా ఉంది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అన్నారు. 

ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చూశాక హీరోలో మంచి ఈజ్‌ కనపడింది. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. రాజవంశీ చాలా సిన్సియర్‌ ప్రొడ్యూసర్‌. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ చాలా బాగున్నాయి. సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ‘‘రాజవంశీ చాలా కాలంగా నా మిత్రుడు. చాలా కష్టపడి ప్రొడక్షన్‌ మేనేజర్‌ నుండి ప్రొడ్యూసర్‌ అయ్యే స్థాయికి వచ్చారు. చాలా క్యాలిక్యులేటెడ్‌ మనిషి. అందరూ నూతన నటీనటులతో చేసిన ఈ ప్రయత్నాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘రాజవంశీ నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన డైరెక్టర్‌ నుండి నిర్మాత అయ్యారు. ట్రైలర్‌ చాలా బాగుంది. ‘దుర్మార్గుడు’ ఫుల్‌ మాస్‌ మసాలా సినిమా. హీరోకి తొలి చిత్రం అయినా బ్రహ్మాండంగా నటించాడు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అన్నారు. 

హీరోయిన్‌ ఫిర్దోస్‌ భాను మాట్లాడుతూ.. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. విజయ్‌ చాలా సపోర్ట్‌ చేశారు. నన్ను చాలా అందంగా చూపించిన మల్లిక్‌గారికి నా కృతజ్ఞతలు’’ అన్నారు. 

హీరో విజయ్‌ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘కేవలం సంకల్ప బలంతోనే ఎలాంటి శిక్షణ తీసుకోకుండా హీరో అయ్యాను. ప్రొడ్యూసర్‌ గారిలో చాలా స్టఫ్‌ ఉంది. దర్శకుడు సినిమాను ఎంతో కేర్‌ తీసుకొని తెరకెక్కించాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. మా సినిమాను ముందు నుండి సపోర్ట్‌ చేసిన హీరో శ్రీకాంత్‌గారికి నా హృదయపూర్వక నమస్కారాలు’’ అన్నారు. 

దర్శకుడు సునీత్‌ జంపా మాట్లాడుతూ.. ‘‘నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌ రాజవంశీగారికి నా ధన్యవాదాలు. అలాగే శ్రీమతి అపర్ణగారు కూడా ఈ సినిమా కోసం చాలా సపోర్ట్‌ చేశారు. హీరో విజయ్‌ బాగా నటించాడు. భాను కూడా చాలా అనుభవం ఉన్న ఆర్టిస్ట్‌లా పెర్‌ఫామ్‌ చేసింది. ఈ సినిమాతో 25 మంది నూతన నటీనటులు, టెక్నీషియన్స్‌ పరిచయమవుతున్నారు. 1980లో కాకినాడలో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. 

ప్రొడ్యూసర్‌ రాజవంశీ మాట్లాడుతూ.. ‘‘మా సినిమా సంబంధించి సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్‌ సభ్యులు మా టీం అందర్నీ అప్రిషియేట్‌ చేశారు. నేను రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మాతగా మారాను. ఈ సినిమాను తప్పకుండా ప్రతి ఒక్కరూ సపోర్ట్‌ చేసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను..’’ అన్నారు.

Suman Praises Durmargudu:

Durmargudu Movie Audio Launch details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs