Advertisement
Google Ads BL

ఇప్పుడు గానీ వర్మ వదిలాడంటే.. ఉంటది!!


 

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నానుతున్న ఎన్టీఆర్ బయోపిక్ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఎన్టీఆర్ జీవితాన్ని ప్రజలకు చూపించి.. లాభపడదామనుకున్న వారికీ గూబ గుయ్యమనే దెబ్బ పడింది. ఎన్టీఆర్ జీవిత చరిత్రని సినిమాగా చేసి.. దాన్ని హిట్ చేస్తే అది ఆయనకు ఇచ్చే నివాళి అంటూ తెగ ఊదరగొట్టిన బాలయ్య అండ్ కో.. ప్రస్తుతం షాక్‌లో ఉన్నారు. భారీ బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ తెరకెక్కించిన కథానాయకుడు, మహానాయకుడు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి.. ఎందులో అనుకుంటున్నారా.. డిజాస్టర్స్ విషయంలో. కథానాయకుడే ఘోరం అనుకుంటే.. మహానాయకుడు పరిస్థితి మరీ ఘోరం. 

మరి తమకి ఫేవర్‌గా తీసుకున్న ఎన్టీఆర్ బయోపిక్ పరిస్థితి అలా ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ ఘోష అంటూ..సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటో అనేది.... ప్రస్తుతం హాట్ టాపిక్. ఎన్టీఆర్.. కుటుంబ సభ్యుల నుండి ఎదుర్కొన్న అవమానాలు, రెండో పెళ్లి, ఆయన మరణం ఆధారంగా తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో ప్రస్తుతం వర్మ తెగ హడావిడి చేస్తున్నాడు. ట్రైలర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ... సాంగ్స్ తోనూ అదరకొట్టేస్తున్నాడు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి ఏది యూట్యూబ్‌లో వదిలినా క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఇక యూట్యూబ్‌లో రచ్చ చేస్తున్న వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఎప్పుడు విడుదల చేస్తాడో క్లారిటీ ఇవ్వడం లేదు. కరెక్ట్‌గా కథానాయకుడు, మహానాయకుడు సినిమాల డిజాస్టర్స్ సమయంలో వర్మ గనక లక్ష్మీస్ ఎన్టీఆర్ ని దించితే.... ఆ సినిమా భారీ హిట్ అవడం ఖాయం. మరి ఈ సమయాన్ని వర్మ సద్వినియోగం చేసుకుంటాడా అనేది ప్రస్తుత ప్రశ్న. ఎందుకంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్, సాంగ్స్ వదులుతున్న వర్మ షూటింగ్ అప్ డేట్ ఇవ్వడంలేదు. ఇక వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని మంచి ప్రాఫిట్ తో అమ్మేసి క్యాష్ చేసుకుంటున్నాడు కూడా. మరి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడితో విసిగిపోయిన ప్రేక్షకులు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని హిట్ చెయ్యకపోయినా.. భారీ‌గా ఓపెనింగ్స్ ఇవ్వడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Superb Timing to Release Varma Lakshmis NTR:

RGV Lakshmis NTR: No Update on Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs