Advertisement
Google Ads BL

రకుల్‌కి అక్కడ కూడా స్పాట్ పెట్టేస్తోంది


‘ఛలో’తో నెమ్మదిగా తెలుగులోకి అడుగుపెట్టి.. గీత గోవిందం బ్లాక్‌బస్టర్‌తో పాతుకుపోయిన రష్మిక టాలీవుడ్‌లో తన కెరీర్‌ని చక్కబెట్టుకుంటుంది. ఇప్పటికే తనకి అచ్చొచ్చిన హీరో విజయ్ దేవరకొండ‌తో మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న రష్మిక, నితిన్ తోనూ భీష్మ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం మీడియం అండ్ యంగ్ హీరోలంతా రష్మిక వేపే చూస్తున్నారు. ఎలాగూ తెలుగులో క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కొరత ఉంది. అప్పట్లో అందరికీ ఏకైక ఆప్షన్‌గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. స్పైడర్ దెబ్బకి టాలీవుడ్‌లో ఆఫర్స్ కోసం వేచిచూడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అలాంటి టైం లోనే రష్మిక మెల్లగా రకుల్ కి తెలుగులో చెక్ పెట్టేసింది. ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాల్తో బిజీగా వున్న రష్మిక మందన్న ఇప్పుడు తమిళంలోనూ కాలు పెట్టింది.

Advertisement
CJ Advs

తమిళనాట కార్తీ హీరోగా డ్రీం వారియర్స్ నిర్మిస్తున్న చిత్రంలో రష్మిక హీరోయిన్ గా ఎంపికైంది. మరి తెలుగులో గట్టి హీరోయిన్ గా పాతుకుపోతున్న రష్మిక తమిళంలోనూ పాగా వెయ్యడం ఖాయంగానే కనబడుతుంది. ప్రస్తుతం రెండు సినిమాల్తో అక్కడ రకుల్ కాస్త బిజీగా వుంది. ఇక రకుల్ కి నిన్నగాక మొన్న కార్తీ‌తో కలిసి నటించిన దేవ్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక సూర్యతో ఎన్‌జికె  సినిమాలో నటిస్తున్న రకుల్ ప్రీత్‌కి ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ కేరెక్టర్ దొరికింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా... మొత్తం క్రెడిట్ సూర్యకి మొదటి హీరోయిన్ సాయిపల్లవికి వెళ్ళిపోతుంది. మరి రష్మిక, కార్తీతో కలిసి నటించే చిత్రం గనక హిట్ అయ్యింది అంటే.. రష్మిక అక్కడ కూడా రకుల్‌కి స్పాట్ పెట్టేస్తుందనే టాక్ నడుస్తుంది.

మరి తెలుగులో ఆఫర్స్ కోసం అల్లాడుతున్న రకుల్ ప్రీత్ తాజాగా సీనియర్ హారో నాగార్జునతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగ్ హీరోగా మన్మధుడు 2లో రకుల్ ప్రీత్ హీరోయిన్ అంటున్నారు. ఇక బెల్లంకొండ సరసన ఛాన్స్ దక్కుతుందనుకుంటే.. అది కాస్తా అనుపమ తన్నుకుపోయింది. ఇక తాజాగా తమిళంలోనూ రష్మిక అడుగుపెట్టడంతో.. రకుల్‌కి అక్కడ కూడా అవకాశాలు సన్నగిల్లేలా కనబడుతుంది వ్యవహారం.

Rashmika Turns Villain to Rakul Preet Singh :

Rashmika Enters Kollywood with Karthi Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs