Advertisement
Google Ads BL

మెగా ఫ్యాన్స్ వ్యతిరేకత మొదలైంది


నాని - విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు మేకర్స్. చిన్న వీడియో బిట్ వదిలి అందులో గ్యాంగ్ లీడర్ అంటూ రిలీజ్ చేసారు. అలా రిలీజ్ చేసారో లేదో వెంటనే మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. చిన్నపాటి వార్నింగ్స్ కూడా ఇచ్చారు.

Advertisement
CJ Advs

ఈ సినిమా టైటిల్ మార్చకపోతే బాయ్ కాట్ చేస్తామని వార్నింగ్ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. మెగా ఫ్యామిలీ హీరోస్ అయితే ఆలోచిస్తాం అని అలాంటిది బయట వ్యక్తులు పెట్టుకోవడంపై నిరసన తెలియజేసారు. ట్విట్టర్ లో మైత్రి మూవీస్ బ్యానర్ ని ట్యాగ్ చేస్తూ ఈ పోస్టులు పెట్టారు. నిజానికి ఈ టైటిల్ తో రామ్ చరణ్ వద్దాం అనుకున్నాడు.

బోయపాటితో చేసిన సినిమాకు ఇదే టైటిల్ పెడదాం అని డిసైడ్ అయ్యి చివరికి వద్దు అనుకుని వినయ విధేయ రామ టైటిల్ తో కానిచ్చేశారు. అలానే సాయి ధరమ్ తేజ్ ఈ టైటిల్ ను వాడుకుద్దాం అనుకున్నాడు కానీ వాడుకోలేదు. కానీ మెగా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధంలేని నాని ఎలా వాడుకుంటాడు? అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా టైటిల్ ని మార్చమని లేదంటే తమ నుంచి బాయ్ కాట్ ఎదురుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి నాని - విక్రమ్ కుమార్ ఈ టైటిల్ పై ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

Mega Fans Fire on Nani Movie Title:

Nani Uses Mega Title for his Next Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs