Advertisement
Google Ads BL

మహేష్‌కు అవమానం.. 5 గంటలు వెయిటింగ్!


మహేష్ కి కోపం రావడం ఏమిటా అనుకుంటున్నారా... మహేష్ బాబు, వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్నాడు. సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుంటున్న మహర్షి మూవీ ఏప్రిల్ 5 న విడుదల అని ఆ సినిమా మేకర్స్ ప్రకటించారు. అవడానికి ముగ్గురు నిర్మాతలైనా అన్ని విషయాలను దిల్ రాజే చూసుకుంటున్నాడు. అశ్విని దత్, పివిపిలు మాత్రం సైడ్ నుండి అన్ని చూసుకుంటుండగా.. దిల్ రాజు మాత్రమే మీడియాకి ఫోకస్ అవుతున్నాడు. ఇక ఏప్రిల్ మొదట్లో విడుదలని గత ఏడాది చెప్పిన... చివరికి ఏప్రిల్ 25 న విడుదల అంటూ దిల్ రాజు మరో కొత్త డేట్ ఇచ్చాడు. కానీ తాజాగా మహర్షి రీ షూట్స్ వలన మహర్షి మళ్ళీ ఏప్రిల్ 25 నుండి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి.

Advertisement
CJ Advs

ఇకపోతే మహేష్ కి కోపం రావడానికి కారణం ఏమిటంటే.. మహర్షి షూటింగ్ ప్రస్తుతం  శంషాబాద్ ఎయిర్ పోర్ట్  పరిసర ప్రాంతాలతో పాటుగా.  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోను జరుపుకుంటుంది. అయితే  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ అంటే దానికి అన్ని పర్మిషన్స్ అవసరం. మరి మహర్షి టీం ముందే ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ చేసుకోవడానికి గల అనుమతులు సంపాదించింది. ఇక ఎప్పటిలాగే షూటింగ్ కోసం మహేష్ మేకప్ గట్రా వేసుకుని.. ఉదయం 7.30 కే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడట. అయితే మహేష్ ని షూటింగ్ కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోకి ఎయిర్ పోర్ట్ అధికారులు వెళ్లకుండా అడ్డుకున్నారట.

షూటింగ్ కి కావాల్సిన అనుమతులు ఢిల్లీలోని ఉన్నత అధికారులు ఇచ్చేవరకు మహర్షి షూటింగ్ ఆపమని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు కోరినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ కి కావాల్సిన పర్మిషన్స్ తమవద్ద ఉన్నాయని మహర్షి మూవీ యూనిట్ ఎంత చెప్పినా ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టించుకోకపోవడంతో.. చేసేది లేక మహేష్ కార్ వ్యాన్ లో వెయిట్ చేస్తున్నాడట. అయితే ఐదారు గంటలైనా షూటింగ్ కి అనుమతి లభించకపోవడంతో... మహేష్ కి మహర్షి టీం మీద.. దిల్ రాజు మీద కోపం వచ్చిందని.... ఇక ఆ కోపంలో మహేష్ అక్కడినుండి ఇంటికెళ్లిపోయాడనే న్యూస్ హైలెట్ అయ్యింది.

Mahesh Babu Spends Five Hours at Shamshabad Airport:

Mahesh Waited Patiently For 5 Hours  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs