Advertisement
Google Ads BL

‘ఐఐటీ కృష్ణమూర్తి’ టీజర్ వదిలారు


పృథ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి’. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ సినిమాని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు. వినూత్నమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను  ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు విడుదల చేశారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా కె.ఎస్‌ రామారావు మాట్లాడుతూ.. ‘‘చిత్ర దర్శకుడు శ్రీ వర్ధన్ చాలా మంచి వ్యక్తి. టాలెంటెడ్ పర్సన్ అని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. టీజర్‌లో ఏదో వుంది. హీరో హీరోయిన్ బాగున్నారు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్..’’ అన్నారు.

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ‘‘ఐఐటి కృష్ణమూర్తి టైటిల్ వెరైటీ‌గా టీజర్ ఇంటెన్స్‌గా చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్.‌ యూత్ అందరూ కలిసి చేసిన ఈ సినిమా నిర్మాతకు సక్సెస్‌ను అందించాలని ఆశిస్తున్నాను..’’ అన్నారు. 

చిత్ర దర్శకుడు శ్రీ వర్దన్ మాట్లాడుతూ.. ‘‘ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు. నేటి తరానికి నచ్చేలా ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను తీశాము. నిర్మాత సపోర్ట్ ఎప్పటికీ మరచిపోలేము. అందరికి మా ‘ఐఐటి కృష్ణమూర్తి’ నచ్చుతాడని నమ్ముతున్నాము..’’ అన్నారు.

సంగీత దర్శకుడు నరేష్ కుమారన్ మాట్లాడుతూ.. ‘ఇదొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అందరు జెన్యూన్‌గా కష్టపడ్డామన్నారు.

చిత్ర సమర్పకులు ప్రేమ్ కుమార్ పాత్ర మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ నేకూరి తొలిసారి అయినా విషయం ఉన్న మంచి సినిమా చేశారు. ఈ టీమ్‌కు సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను..’’ అన్నారు.

నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ..‌ ‘‘సినిమా ఫీల్డ్ నాకు కొత్త. ఈ చిత్ర దర్శకుడు, రైటర్ పట్టుదల, కథ నచ్చి ఈ సినిమా చేశాం. ఈ కాన్సెప్ట్ యూనివర్సల్. అది నచ్చి ప్రేమ్ కుమార్ సపోర్ట్ చేశారు’’ అన్నారు.

హీరో పృథ్వీ దండమూడి మాట్లాడుతూ.. ‘‘నేను హీరో అయినా, మా టీమ్ మెంబర్స్ ఈ చిత్రానికి రియల్ హీరోస్. నిర్మాత ప్రసాద్ గారు  అవగాహన లేకపోయినా కథ పైన తనకున్న నమ్మకంతో ఈ సినిమా చేశారు‌. అందరూ కష్టపడి బెస్ట్ ఔట్‌పుట్ రావటానికి కృషి చేశాం..’’ అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, రమేష్ మద్దినేని, బాబ్జీ, రామ్ రావిపల్లి  తదితరులు పాల్గొన్నారు.

పృథ్వీ దండమూడి, మైరా దోషి, వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి

దర్శకుడు: శ్రీ వర్ధన్

సమర్పణ: ప్రేమ్ కుమార్ పాత్ర

నిర్మాత: ప్రసాద్ నేకూరి

బ్యానర్: క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ , సినిమాటోగ్రఫీ: యేసు.పి

సంగీతం: నరేష్ కుమారన్

ఎడిటర్: అనిల్ కుమార్.పి

రచన: నాగార్జున మనపాక

గీత రచయిత: రామాంజనేయులు సంకర్పూ

లైన్ ప్రొడ్యూసర్: ఎల్.వి. వాసుకి

పి.ఆర్.ఓ: సాయి సతీష్.

IIT Krishnamurthy Teaser Released:

KS Ramarao Releases IIT Krishnamuthy Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs