Advertisement
Google Ads BL

బాలయ్య ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి!


బాలకృష్ణ తన తండ్రి పాత్రని ఎంతో ఇష్టంగా చేసిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తంటాలు పడుతుంది. కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు పార్టులుగా ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ పెట్టి ఎన్టీఆర్ బయోపిక్‌ని స్వయానా బాలకృష్ణ నిర్మించాడు. అయితే కథానాయకుడు భారీ డిజాస్టర్ కాగా.. మహానాయకుడు సినిమా కూడా కథానాయకుడు తలతన్నే డిజాస్టర్ అయ్యేలా కనబడుతుంది.. ఈ చిత్రానికి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే. మరి కథానాయకుడు టైమ్‌లో బాగా హడావిడి చేసిన బాలయ్య.. మహానాయకుడు అప్పుడు సైలెంట్‌గా ఉన్నాడు. ఇక మహానాయకుడు విడుదలయ్యాక కూడా బాలయ్య ఎక్కడా మీడియాకి దొరకలేదు.

Advertisement
CJ Advs

కానీ బాలకృష్ణ ఇప్పుడు మీడియాకి అడ్డంగా దొరికిపోతున్నాడు. అలాగే మహానాయకుడు గురించి తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ రోజు (సోమవారం) సాయంత్రం భారీగా జరగబోయే కళ్యాణ్ రామ్ 118 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. మరి కళ్యాణ్ రామ్ సినిమా ఈవెంట్‌ అయినప్పటికీ బాబాయ్ మాటలకే ఎక్కువ అవకాశమిస్తాడు అబ్బాయ్. మరి 118 గురించి కావాల్సింది మాట్లాడి.. చివరికి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు గురించి మాట్లాడాల్సి వస్తుంది. మరి బాలయ్య దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి. అన్నట్టు ఈ 118 ఈవెంట్ కి తారక్ అదేనండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరవుతున్నాడు.

Waiting Balakrishna Speech for NTR Biopic Result:

Balakrishna Chief Guest for 118 pre release function
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs