దర్శకుడు క్రిష్ బాలీవుడ్‌లో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కిద్దామనుకున్న ఝాన్సీ లక్ష్మి భాయ్ చరిత్ర మణికర్ణిక సినిమా.. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కంగనా రనౌత్ వలన ఊరు పేరు లేకుండా పోయింది. ఆ సినిమా కోసం ఏడాది పాటు కష్టపడ్డాడు. కానీ ఆ ఫలితాన్ని కంగనా తీసేసుకుంది. మణికర్ణిక షూటింగ్ కంప్లీట్ చేసే లోపు కంగనాతో గొడవలు జరగడంతో.. సైలెంట్ గా... క్రిష్ ఆగిపోతుంది అనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ లోకి వచ్చి చేరాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ మీదుండగా ఆగిపోవడంతో.. మరోపక్క మణికర్ణికతో విభేదాలతో క్రిష్, బాలయ్యని కలవడం ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తానని అడగడంతో.. పాత పరిచయం, క్రిష్ మీద నమ్మకంతో ఎన్టీఆర్ బయోపిక్‌ని క్రిష్ చేతికప్పజెప్పాడు బాలకృష్ణ.
ఇక మణికర్ణికని పూర్తిగా పక్కనపడేసి.. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు కోసం 200 రోజులపాటు కష్టపడ్డాడు క్రిష్. ఈలోపు కథానాయకుడు విడుదలై హిట్ టాక్‌తో డిజాస్టర్ కలెక్షన్స్ రావడంతో.. కాస్త ఇబ్బంది పడిన క్రిష్.. అప్పుడే విడుదలైన మణికర్ణిక సినిమా విషయంలో కంగనాతో గొడవ పెట్టుకున్నాడు. ఆఖరుకి మణికర్ణికకి ఏడాదిన్నర పనిచేసినందుకు పూర్తి పారితోషకం కూడా అందుకోలేకపోయాడు క్రిష్. ఇక టాలీవుడ్‌లో కథానాయకుడు పరిస్థితి అలా ఉంటే... తాజాగా విడుదలైన మహానాయకుడు పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. క్రిష్ అనుకున్నది చేయకుండా.. బాలయ్య చెప్పింది వినడం వలనే ఎన్టీఆర్ బయోపిక్‌కి క్రిష్ నానా మాటలు పడాల్సి వస్తుంది.
పాపం బాలీవుడ్‌లో మణికర్ణికతో ఎదురుదెబ్బతిన్న క్రిష్ ఇక్కడ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడితో ఎదురుదెబ్బ తిన్నాడు. అటు మణికర్ణిక పుండు మానకుండానే... మహానాయకుడుతో మళ్ళీ గాయమవడంతో... క్రిష్ పరిస్థితి చెప్పనలవి కాదు. ఇక ఏకధాటిగా పనిచేసి అలిసిపోయానని చెబుతున్న క్రిష్ మరో ప్రాజెక్ట్ మొదలెట్టడానికి బాగా టైం తీసుకునేలానే కనబడుతుంది ప్రస్తుత వ్యవహారం. అదేగనక మహానాయకుడు హిట్ అయితే క్రిష్ ఆలోచన మరోలా ఉండేది. మరి పాపం మణికర్ణిక, ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో క్రిష్ ఎంతగా నలిగిపోయాడో కదా!