‘ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావగారూ బాగున్నారా, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, లక్ష్మీనరసింహ..’ వంటి సూపర్‌హిట్ చిత్రాల డైరెక్టర్ చేసిన వెర్సటైల్ డైరెక్టర్ జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో ఈషాన్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో నిలేష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నరేంద్ర’. ఈ చిత్రంలో ప్రముఖ మోడల్ ఇజా బెల్లె హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ మార్చి 10 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా వెర్సటైల్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ.. ‘‘నిలేష్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో.. చాంపియన్‌గా ఎదిగిన ఓ బాక్సర్ కథాంశంతో మా ‘నరేంద్ర’ చిత్రం తెరకెక్కతోంది. కథాంశం వైవిధ్యంగా ఉంటుంది. ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ మార్చి 10 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ రెజ్లింగ్‌లో మన దేశం తరపున సత్తా చాటుతున్న స్టార్ రెజ్లర్ గ్రేట్ కాళీ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్ కూడా ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ప్రముఖ మోడల్ ఇజా బెల్లె హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమాను అనుకున్న ప్రణాళికలో తెరకెక్కిస్తున్నాం. అన్ని ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుంది’’ అన్నారు.
హీరోయిన్ ఇజా బెల్లా మాట్లాడుతూ.. ‘‘జయంత్ వంటి సీనియర్ డైరెక్టర్‌గారితో పనిచేయడం హ్యాపీగా ఉంది. ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు.
నిలేష్, ఇజా బెల్లె, ది గ్రేట్ కాళీ నటిస్తోన్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఫైట్స్: వెంకట్, డైలాగ్స్: హరీష్ కోయల గుండ్ల, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: రామ్ సంపత్, కెమెరా: వీరేన్ తంబిదొరై, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయలగుండ్ల, నిర్మాత: ఈషాన్ ఎంటర్‌టైన్మెంట్, కథ, దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ.