Advertisement
Google Ads BL

‘ఎన్టీఆర్’ని దారుణంగా అవమానించారుగా!


నందమూరి తారక రామరావు అంటే.... అటుసినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ప్రజలు దేవుడిగా కొలిచిన వ్యక్తి. ప్రజలకు రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాడు. కిలో రెండు రూపాయల బియ్యం లాంటి పథకాలు పేదలకు ఎంతో మంచి చేశాయి. ఇక నట జీవితంలోను ఎన్టీఆర్ కి ప్రేక్షకాభిమానగణం మాములుగా లేదు. ఆయన సినిమాలంటే ఇప్పటికి చెవులు కోసుకునే ప్రేక్షకులు ఉన్నారు. అందులోను రాముడు, కృష్ణుడు లాంటి గెటప్స్ తో దేవుడంటే ఎన్టీఆరేరా అన్నట్టుగా అయన గెటప్స్ ఉండేవి. అయితే అలాంటి మహోన్నత వ్యక్తి జీవిత చరిత్రని సినిమా తియ్యడమనేది సాహసమే. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితం అందరికి తెరిచిన పుస్తకం. ఎన్టీఆర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలంటూ ఏమి లేవు.

Advertisement
CJ Advs

అదే మహానటి సావిత్రి లాంటి వాళ్లయితే.. ఈనాటి తరానికి పెద్దగా తెలియకపోవడం, ఆమె జీవితం అంతా ట్రాజడీగా సాగడంతోనే ఆమె బయోపిక్ మహానటి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  కానీ ఎన్టీఆర్ బయోపిక్ అలా కాదు. ఆయన సినిమా జీవితంలో ఎలాంటి కాంట్రవర్సీలు లేవు. అలాగే రాజకీయాల్లోకొచ్చాక అనేక సంఘటనలు ఆయన చావు వరకు తీసుకొచ్చాయి. అయితే నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను చెయ్యడం తన అదృష్టం అంటూ అయన కుమారుడు హీరో అయిన బాలకృష్ణ.... ఎన్టీఆర్ బయోపిక్ ని కథానాయకుడు, మహానాయకుడిగా తెరకెక్కించాడు. ఆ సినిమాల్లో కథానాయకుడు ఎన్టీఆర్ నట జీవితాన్ని కూలంకషంగా చూపించారు. ఆ సినిమా ఎంత బావున్నప్పటికీ... అందులో ట్రాజడీ, ఎమోషన్ కరువడంతో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఇక తాజాగా మహానాయకుడు పరిస్థితి అదే. మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ ని కొన్నిసార్లు హీరోగా చూపిస్తూనే ఎన్టీఆర్ కి రాజకీయాల్లో వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని హీరోగా చూపించారు. ఇక బసవతారకం మరణం, ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్ రావు నుండి మళ్ళీ సీఎం కుర్చీ లాక్కోవడానికి చేసిన పోరాటాలనే తెర మీద చూపించారు కానీ.. ఆయన వెన్నుపోటు రాజకీయాలు కానీ.. కుటుంబ సభ్యులంతా కలిసి ఆయన్ని వెలివేసిన విషయాలను కానీ.. అలాగే మరణించేటప్పటికీ ఎన్టీఆర్ పడిన క్షోభని కానీ చూపించకుండా ఎన్టీఆర్ బయోపిక్ ని అసంపూర్ణం చేసారు. మరి అర్ధం పర్ధం లేని ఈ ఎన్టీఆర్ బయోపిక్ తో ఎన్టీఆర్ కి అవమానమే జరిగింది. మరి ఎన్టీఆర్ సినిమా అంటే ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తి ఉండాల్సింది పోయి.. అసలెలాంటి ఆసక్తి లేకుండా ఎన్టీఆర్ బయోపిక్ ని తిరస్కరించడం అనేది... మాత్రం ఎన్టీఆర్ ని అవమానించడమే కదా.  ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నెగెటివిటీని చూపించకుండా ఎవరికి తోచిన విధంగా, ఎవరికి కావాల్సిన విధంగా ఈ మహానాయకుడు సినిమాని తెరకెక్కించారని పలువురు ముక్త ఖంఠంతో చెబుతున్నమాట.

Legend NTR Insulted with NTR Biopic:

NTR Biopic Flop at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs