బాలీవుడ్‌లో వున్న ఏకైక రైజింగ్ స్టార్ రణ్‌వీర్‌సింగ్. ఇతని ఎనర్జీని సిల్వర్ స్క్రీన్‌తో పాటు అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. రణ్‌వీర్ నటించిన తాజా చిత్రం `గల్లీబాయ్`. ఈ సినిమా రిలీజ్‌కు ముందు నిర్వహించిన ఓ ప్రమోషనల్ ఈ వెంట్‌లో రణ్‌వీర్‌సింగ్ ఉత్సాహం హద్దులు దాటింది. దాంతో అక్కడున్న అభిమానులపై హఠాత్తుగా దూకేశాడు. హఠాత్తుగా దూకేయడంతో ఆడా మగా తేడా లేకుండా చాలా మందికి గాయాలయ్యాయి. దీంతో అతనిపై విమర్శల వర్షం కురిసింది. అయితే తను నటించిన సినిమా మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇటీవల విడుదలై ఇప్పటికే దాదాపుగా 170 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
`జిందగీ నా మిలేగీ దుబారా` ఫేమ్ జోయా అక్తర్ దర్శకత్వంలో ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, రితేష్ శిద్వానీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రీమేక్‌పై మనవాళ్ల కన్నుపడింది. దీన్నిఎలాగైనా తెలుగు తెరపైకి తీసుకురావాలని మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రీమేక్ హక్కుల కోసం చిత్ర నిర్మాతల్ని అల్లు అరవింద్ సంప్రదించారట. రీమేక్ రైట్స్ ఓ కొలిక్కి వస్తే తెలుగు రీమేక్ అన్నది లాంఛనమే. అయితే ఈ చిత్రాన్ని సాయిధరమ్‌తేజ్‌తో రీమేక్ చేస్తారని ఓ వార్త వినిపిస్తోంది. ఇదిలా వుంటే బాలీవుడ్ కు సంబంధించిన ఓ వెబ్‌సైట్ ఈ చిత్రాన్ని తెలుగులో ఎవరితో రీమేక్ చేస్తే పర్‌ఫెక్ట్‌గా వుంటుందనే సర్వేను నిర్వహించింది.
అల్లు అర్జున్?, రానా దగ్గుబాటి? , విజయ్ దేవరకొండ అంటూ ఈ ముగ్గురి పేర్లను చూచిస్తూ పోల్ నిర్వహించింది. ఈ పోల్‌లో రానాకు 9 పాయిట్‌లు, అల్లు అర్జున్‌కు 35 పాయింట్‌లు రాగా విజయ్ దేవరకొండకు మాత్రం ఏకంగా 56 పాయింట్‌లు వచ్చాయి. అత్యధిక భాగం ప్రేక్షకులు `గల్లీబాయ్` తెలుగు రీమేక్‌లో విజయ్ దేవరకొండని చూడాలని కోరుకుంటున్నట్లు తేలిపోయింది. అల్లు అరవింద్ కూడా మరోసారి విజయ్ దేవరకొండనే హీరోగా సెలెక్ట్ చేసుకుని `గల్లీబాయ్` రీమేక్ చేయాలనే ఆలోచనలో వున్నట్లు చెబుతున్నారు. పైగా విజయ్ గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో చేసిన `గీత గోవిందం`, టాక్సీవాలా` బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని `గల్లీబాయ్` ని వియ్‌తో రీమేక్ చేయాలని అల్లు అరవింద్ భావిస్తున్నారట. దీనికి విజయ్ ఏమంటాడో..ఎంత డిమాండ్ చేస్తాడో చూడాలి.