శంకర్ - కమల్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన భారతీయుడు ఎంత సెన్సేషన్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా శంకర్ భారతీయుడు 2 చిత్రం తీసుకున్నాడు. స్క్రిప్ట్ మొత్తం ఓకే అయిపోయింది. అంత సెట్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్తున్న సమయంలో సెట్టింగ్‌లో ఏవో లోపాలు ఉండడంతో మార్పులు చేర్పులు చేసి మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు. కమల్ మేకప్ కోసం చాలానే ఖర్చు పెట్టారు.
షూటింగ్ స్టార్ట్ చేసి నెల రోజులు కూడా కాకుండానే 30 కోట్లు ఖర్చు అయిందట. దాంతో బడ్జెట్ రెట్టింపు అయ్యేలా ఉంది అంటూ లైకా వారు భయపడి బడ్జెట్ పరిమితికి అగ్రిమెంట్ ఇవ్వాల్సిందిగా కోరారట. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను 250 కోట్లు లోపే పూర్తి చేస్తానంటూ లైకా వారికి హామీ ఇచ్చాడట శంకర్. ఇలా ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏదొక సమస్యే. మొదట ఈ సినిమాను దిల్ రాజు నిర్మిద్దాం అనుకున్నాడు కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించి పక్కకు తప్పుకున్నాడు.
ఇక శంకర్ పై కమల్ కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శంకర్ ప్రతి సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తాడు. కానీ భారతీయుడు 2 కి అనిరుద్‌ని తీసుకుని వచ్చారు. అది కమల్‌కు పెద్దగా నచ్చలేదు. రీసెంట్‌గా అనిరుద్ ఒక ట్యూన్ ఇస్తే అది కమల్ కి అసలు నచ్చకపోవడంతో మళ్లీ రెహమాన్ ను ఈ చిత్రంలోకి తీసుకురావాలని కోరుతున్నాడట. కానీ శంకర్ ఏమి పటించుకోలేదట. అలా ఈ సినిమా షూటింగ్ ఇగోస్ మధ్య, హెవీ బడ్జెట్ వల్ల జరుగుతుంది. ఇలా ఉంటే సినిమా ఎప్పుడు కంప్లీట్ అయ్యేను.