Advertisement
Google Ads BL

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంతు చూడబోతున్నాడా?


బాలకృష్ణ ఎంతో ఇష్టపడి, కష్టపడి, డబ్బు పెట్టి నిర్మించిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు థియేటర్స్ లోకొచ్చేశాయి. కథానాయకుడు టాక్ బావున్నా కలెక్షన్స్ రాలేదు. ఇక తాజాగా విడుదలైన మహానాయకుడికి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో.. సినిమా పరిస్థితి ఏమిటనేది ఈ వీకెండ్ గడిస్తేనే గాని చెప్పలేం. ఇక బాలకృష్ణ ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో బాగా అలిసిపోయి ఉన్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ ని ఒక మహా యజ్ఞంలా బాలకృష్ణ - దర్శకుడు క్రిష్ లు పూర్తి చేశారు. ఫలితాన్ని ప్రేక్షకులకే వదిలేసారు. ఇక బాలకృష్ణ ఇప్పుడు మరో పనిలో బిజీగా ఉన్నాడంటున్నారు.

Advertisement
CJ Advs

అదేమిటంటే తన తండ్రి బయోపిక్ కి పోటీగా రామ్ గోపాల్ వర్మ తెరెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయం పట్ల ఆచితూచి వ్యవహరించడానికి సన్నద్దమవుతున్నాడట. తండ్రి అవసాన దశలో లక్ష్మి పార్వతిని చేసుకోవడం, కుటుంబ సభ్యుల నుండి ఎన్టీఆర్ పడిన కష్టాలను వర్మ తన సినిమాలో చూపించడంతో పాటుగా.. చంద్రబాబు ని విలన్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించబోతున్నాడు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదలయ్యాక ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీ ఆ సినిమాపై స్పందించలేదు. అయితే తాజాగా బాలకృష్ణ లక్ష్మీస్ ఎన్టీఆర్ పై యాక్షన్ మొదలెట్టబోతున్నాడట.

ఎలా అంటే నందమూరి ఫ్యామిలీ మెంబెర్స్ చేత, నారా ఫ్యామిలీ మెంబెర్స్ చేత సెన్సార్ వారికీ ఒక నోటీసు పంపించి లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ అవకుండా సెన్సార్ బోర్డు కి లేఖ పంపే ఏర్పాట్లు మొదలెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. సెన్సార్ బోర్డు ద్వారా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ని థియేటర్స్ లోకి రాకుండా అడ్డుపడాలనే ఉద్దేశ్యంతో బాలకృష్ణ పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. రామ్ గోపాల్ వర్మ తమ ఫ్యామిలీని సినిమాలో అవమానకరంగా చూపించబోతున్నాడని, అలాగే ఒక రాష్ట్ర సీఎం అయిన చంద్రబాబు నాయుడు ని ఒక సినిమాలో విలన్ గా చూపించడం ఏమిటనే పాయింట్స్ మీద బాలయ్య సెన్సార్ ద్వారా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి బ్రేకులు వెయ్యబోతున్నాడనే న్యూస్ మీడియాలో హైలెట్ అవుతుంది. మరి నిజంగానే సైలెంట్ గా బాలయ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ ని అడ్డుకునే ప్రయత్నాలు స్టార్ట్ చేసాడంటారా? ఏమో చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

Balayya action starts on Lakshmis NTR:

Balakrishna Eye on RGV Lakshmis NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs