Advertisement
Google Ads BL

‘అసలేం జరిగింది’లో హీరోయిన్ ఫిక్స్


రోజాపూలు, ఒకరికిఒకరు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. వంటి  విజయవంతమైన చిత్రాలతో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. కొంత విరామం తరువాత ఆయన తెలుగులో నటిస్తున్న చిత్రం ‘అసలేం జరిగింది’. ఈ చిత్రంలో శ్రీరామ్ సరసన కన్నడ భామ సంచితా పదుకునే నాయికగా నటిస్తోంది. ఎక్సోడస్ మీడియా పతాకంపై శ్రీమతి నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు. నెర్రపల్లి వాసు అద్భుతమైన కథను సమకూర్చారు. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్ర విశేషాలను సహ నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ తెలియజేస్తూ.. గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ఒక సస్పెన్స్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హీరో శ్రీరామ్, సంచితాపదుకునే జంట చక్కగా కుదిరింది. అందం, అభినయం కలగలిసిన అచ్చ తెలుగు అమ్మాయిలా సంచితా పదుకునే ఈ చిత్రంలో కనిపిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాం. మే చివరిలోపు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం..’’ అని తెలిపారు. 

Heroine Fixed for Asalem Jarigindi Movie:

Sanchita Padukune in Asalem Jarigindi Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs