Advertisement
Google Ads BL

రకుల్, రాశిఖన్నా అవుట్.. ఈ భామ ఫైనల్!


తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బెల్లంకొండ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్‌లో హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మాతగా ఈ రీమేక్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. తమిళనాట ఈ సినిమా సంచలనాలు నమోదు చెయ్యడమేకాదు... మంచి కలెక్షన్స్ రాబట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని తమిళులు ఆదరించడమే కాదు హిట్ చేశారు. ఇక తమిళంలో రాచ్చసన్ సినిమాలో హీరోయిన్‌గా అమలా‌పాల్ యాక్ట్ చేసింది. ఆ సినిమాలో అమలాపాల్ ఒక స్కూల్ టీచర్‌గా కనబడుతుంది. అయితే తెలుగులో అమలాపాల్ కేరెక్టర్‌లో ముందుగా రకుల్ ప్రీత్‌ని అనుకోగా.. తర్వాత రకుల్ ప్లేస్ లోకి రాశిఖన్నా వచ్చి చేరింది. రకుల్ పారితోషకం ఎక్కువగా డిమాండ్ చెయ్యడంతో రాశిఖన్నానే హీరోయిన్‌గా ఫైనల్ చేశారన్నారు.

Advertisement
CJ Advs

కానీ తాజాగా రాశిఖన్నా ప్లేస్‌లోకి మరో హీరోయిన్ వచ్చి చేరిందంటున్నారు. గత ఏడాది వరస ప్లాప్స్‌తో అస్సలు క్రేజ్ లేకుండా పోయిన అనుపమ పరమేశ్వరన్‌ని రాచ్చసన్ రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఫైనల్ చేశారనే టాక్ మొదలైంది. ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలు వరసగా ప్లాప్ అవడంతో.. అమ్మడు కన్నడకి చెక్కేసింది. కన్నడలో ప్రస్తుతం డెబ్యూ మూవీలో నటిస్తుండగా.. తెలుగులో మాత్రం హలో గురు ప్రేమ కోసమే తరువాత ప్రస్తుతం అనుపమ.. బెల్లంకొండ సినిమాకి మాత్రమే సైన్ చేసిందని అంటున్నారు. ఒకవేళ నిజంగానే అనుపమ ఈ సినిమాకి సైన్ చేస్తే అనుపమ చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా ఇదే అవుతుంది.

Young Heroine Replaces Rakul and Raashi Khanna:

Anupama Parameswaran in Bellamkonda Sai Srinivas film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs