Advertisement
Google Ads BL

క్రిష్ కష్టం కనిపిస్తుంది కానీ.. బాలయ్యే..?


బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కించి ప్రేక్షకులకు రెండు పార్టులుగా అందించాడు. కథానాయకుడు, మహానాయకుడు గా ఎన్టీఆర్ జీవిత చరిత్రని తెరమీద ఆవిష్కరించాడు. బాలకృష్ణ తాను ఎలా తండ్రి బయోపిక్‌ని తీయాలనుకున్నాడో అలానే తీసి విడుదల చేసాడు. తండ్రి జీవిత చరిత్రని సినిమాగా తియ్యడం తన కర్తవ్యం అన్నట్టుగా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కించాడు. దర్శకుడుగా ముందు తేజని అనుకుని.. ఆ తర్వాత తేజ ప్లేస్ లోకి దర్శకుడు క్రిష్‌ని తీసుకురావడంతో.. ఎన్టీఆర్ బయోపిక్ రూపురేఖలు మారిపోయాయి. క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్‌ని రెండు భాగాలుగా తీద్దామని బాలయ్య‌కి చెప్పడంతో బాలయ్య కూడా సరే అనడంతో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడిగా ఎన్టీఆర్ బయోపిక్ మారిపోయింది.

Advertisement
CJ Advs

ఇక కథానాయకుడులో క్రిష్.. బాలకృష్ణని ఎన్టీఆర్ పాత్రలో మంచి... ఎన్టీఆర్‌కి వన్నె తెచ్చిన గెటప్స్‌తో అందంగా చూపించాడు. ఇక మహానాయకుడు కూడా క్రిష్ తనదైన శైలిలో తెరకెక్కించలేకపోవడానికి కారణం బాలకృష్ణే అన్నట్టుగా ఉంది మహానాయకుడు చూసిన తర్వాత వ్యవహారం. మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం, సీఎం అవ్వడం అనేవి చాలా ఎమోషనల్‌గా బలంగా చూపించాలి. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీని స్థాపించడం, సీఎం అవడం, అలాగే ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లడం అనేవి అంతగా టచ్ అవలేదు. ఏదో నార్మల్ ఫ్లోలోనే ఆ సన్నివేశాలు జరిగిపోయాయి. ఇక నాదెండ్లను పవర్ ఫుల్ నెగెటివ్ కేరెక్టర్ గా చేసిన తీరు బాగుంది. కానీ చంద్రబాబుని మరీ హీరోగా చూపించడం బావుండలేదు. అది క్రిష్ అనుకున్న పాయింట్ అయ్యి ఉండదు. ఏదో బాలయ్య చెబితే క్రిష్ చేసినట్టుగా అనిపిస్తుంది. అందుకే సోషల్ మీడియా సాక్షిగా CBN మహానాయకుడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక CBN బయోపిక్ ఫస్ట్ పార్ట్ అంటూ కామెడీ కామెంట్స్ చేస్తున్నారు.

మరి క్రిష్ అనుకున్నట్టుగా కాకుండా బాలకృష్ణ తనకు నచ్చింది క్రిష్ చేత తీయించినట్టుగా చాలా సన్నివేశాలు అనిపిస్తాయి. ఇక సినిమాని ఎన్నికల లోపు విడుదల చెయ్యాలనే అతృతతో.. చాల సన్నివేశాలను స్టూడియోస్ లో సెట్స్ వేసి మమ అనిపించేసారు. అందుకే చాలా సన్నివేశాలు నేచురల్ గా అనిపించకుండా చాలావరకు ఆర్టిఫీషియల్ గా అనిపిస్తాయి. మరి 200 రోజులు క్రిష్ అస్సలు రెస్ట్ లేకుండా ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల షూటింగ్ ని చిత్రీకరించాడు. కానీ క్రిష్ పడిన కష్టం తెరమీద కనబడుతున్నప్పటికీ.. ప్రేక్షకుడు ఎందుకో అంతగా సినిమాలో ఇన్‌వాల్వ్ కాలేకపోతున్నాడు. మరి కథానాయకుడు సినిమాకి సూపర్ హిట్ టాక్ అండ్ రివ్యూస్ వస్తే.. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. మరి ఇప్పుడు కథానాయకుడుకి ప్రేక్షకుడు నుండి రివ్యూ రైటర్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. చూద్దాం ఫైనల్‌గా మహానాయకుడు పరిస్థితి ఏమిటి అనేది. 

NTR Biopic.. Praises on Director Krish :

No Craze on NTR Mahanayakudu Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs