Advertisement
Google Ads BL

‘118’పై అంచనాలు పెరగడానికి కారణమిదే!


నందమూరి హీరోలు అంటే నాటి స్వర్గీయ ఎన్టీఆర్‌ నుంచి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ వంటి వారు ఎందరో ఉన్నారు. వీరిలో స్వర్గీయ ఎన్టీఆర్‌ స్థాయిలో కాకపోయినా ఆయన వారసత్వాన్ని అందుకున్న వారిలో బాలయ్య, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌లు ముందుంటారు. ఇక నందమూరి కళ్యాణ్‌రామ్‌ ప్రయత్నాలలో లోపం లేకపోయినా ఆయనకు వరుస విజయాలు మాత్రం రావడం లేదు. ‘అతనొక్కడే, హరేరామ్‌, పటాస్‌’ చిత్రాలు మాత్రమే ఫర్వాలేదనిపించాయి. ఇక ఇటీవల ఆయన ‘ఎమ్మెల్యే, నా నువ్వే’ వంటి మూవీస్‌ చేసినా, పూరీతో ‘ఇజం’ చేసినా ఫలితం రాలేదు. ఇక తాజాగా ప్రస్తుతం ఆయన యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపధ్యంలో ‘118’ అనే వైవిధ్యచిత్రం చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

టైటిలే కాదు... ఫస్ట్‌లుక్‌, టీజర్లు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ గుహన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మార్చి1న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేయాలని భావించినా కూడా తమ్ముడు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ దుబాయ్‌కి వెళ్లడంతో ఆయన వెసులుబాటుని చూసుకుని ఈ వేడుకను ప్లాన్‌ చేస్తున్నారు. ఈ వేడుకకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రావడం ఖాయమైంది. ఈ విధంగా ఎన్టీఆర్‌ తన సోదరుడు కళ్యాణ్‌రామ్‌ని బాగానే ప్రమోట్‌ చేస్తూ, అన్నయ్యని హీరోగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఈ సోదరుల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. షాలినిపాండే, నివేదాథామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా ఓ విషయం ఈ చిత్రంపై అంచనాలను మరింతగా పెంచింది. గతంలో కళ్యాణ్‌రామ్‌- అనిల్‌రావిపూడిల దర్శకత్వంలో వచ్చిన ‘పటాస్‌’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్‌రాజు తీసుకున్నాడు. మరలా ఇంత కాలం తర్వాత ఆయన ‘118’ చిత్రం చూసి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం పంపిణీహక్కులను దక్కించుకోవడంతో ఈ చిత్రంలో ఏదో సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఉందనే అర్ధమవుతోంది. ఇటీవల దిల్‌రాజుకి పంపిణీదారునిగా భారీ నష్టాలు వచ్చాయి. దాంతో ఆయన ఇకపై పంపిణీదారునిగా చేయకూడదని భావించాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆయన మరలా ‘118’ హక్కులను దక్కించుకోవడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. మరి ఈ మూవీ అయినా కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌ని గాడిలో పెడుతుందో లేదో వేచి చూడాల్సివుంది....!

High Expections on 118 Movie:

Dil Raju Bagged 118 Movie Telugu States Rights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs