ప్రముఖ దర్శకుడు, 100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఈరోజు శుక్రవారం అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్ను మూసారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోడి రామకృష్ణని కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చెయ్యగా... శ్వాస తీసుకోవడం కూడా కష్టమవడంతో.. వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్న ఆయన కొద్దీ సేపటి క్రితం మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ 100 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా కోడి రామకృష్ణ మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. ఇంకా కోడి రామకృష్ణ తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్నారు. కోడి రామకృష్ణ తెరకెక్కించిన సినిమాల్లో ‘అమ్మోరు, దొంగాట, మంగమ్మగారి మనవడు’ వంటి ఎన్నో హిట్ చిత్రాలున్నాయి.
ఇక ఆయన దర్శకుడిగా తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ కాగా... చివరి చిత్రం ‘నాగభరణం’. కోడి రామకృష్ణ మరణ వార్త విన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మరణం పట్ల పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం తెలియజేసారు.