Advertisement
Google Ads BL

‘మహానాయకుడు’ టాక్: అసలు మ్యాటరేది?


ఓ అన్నంత అంచనాలేమి లేకుండా చాలా సింపుల్‌గా నేడు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మహనీయుడు నందమూరి తారక రామ రావు జీవిత చరిత్ర రెండో భాగం ‘మహానాయకుడు’. ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు సినిమాని ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాకి కొనసాగింపుగా తెరకెక్కించారు. ఈ సినిమా మొత్తం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ముఖ్యమంత్రి పదవిని అలంకరించడం, భార్య బసవతారకం క్యాన్సర్ వ్యాధితో మరణించడం, అలాగే తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్‌ని నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు రాజకీయాలతో సీఎంగా గద్దె దించడం,  ఢిల్లీ రాజకీయాలలో ఎన్టీఆర్ కీలకంగా మారడం, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి ఎన్టీఆర్ ఎలా చొచ్చుకుపోయింది అనేది దర్శకుడు క్రిష్ అద్భుతంగా చూపించాడు. ఇక ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటన, హావభావాలు అన్ని అద్భుతం, అలాగే నాదెండ్ల క్యారెక్టర్ లో సచిన్ ఖేడ్కర్, చంద్రబాబు పాత్రలో రానా, బసవతారకం కేరెక్టర్ లో విద్యాబాలన్ అదుర్స్ అన్న రేంజ్లో నటించి మెప్పించారు.

Advertisement
CJ Advs

అయితే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా అందరూ బావుందని కితాబునిచ్చిన.. సినిమాలో ఎన్టీఆర్ భజన ఎక్కువైందని.. అలాగే ఎమోషనల్ గా ఎక్కడా టచ్చింగ్ లేకపోవడంతోనే ఆ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయ్యిందని అన్నారు. అందుకే మహానాయకుడి లో అవేమి లోపాలు కాకూడదని క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే మహానాయకుడిలో ప్రధానంగా ఓ లోపం బాగా హైలెట్ అవుతుంది. అదే చంద్రబాబు పాత్ర. నాదెండ్ల ఎపిసోడ్‌తోనూ, బసవతారకం మరణంతోనే మహానాయకుడిని ఎండ్ చెయ్యడం కూడా మహానాయకుడుకి ప్రధాన లోపమే. ఇక చంద్రబాబు.. మామ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడవడం, లక్ష్మి పార్వతి ఎంట్రీ లాంటి ఘట్టాలేమి మహానాయకుడిలో లేకుండా బాలయ్య, క్రిష్‌లు సేఫ్ గేమ్ ఆడారనిపిస్తుంది. 

ఇక మహానాయకుడిలో రాజకీయాల్లోకి రావడమే తెలుగుదేశం పార్టీ పెట్టడం.. తొమ్మిది నెలలలోనే అధికార పీఠాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ అప్పుడు హీరోగానే కనిపిస్తాడు. ఇక భార్య బసవతారకం కోసం విదేశాలకు వెళ్ళినపుడు ఎన్టీఆర్‌కి నమ్మకంగా ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయాలను తనకి అనుగుణంగా మార్చుకుని.. ఢిల్లీ పెద్దల అండదండలతో సీఎం కుర్చీకి ఎన్టీఆర్ ని దూరం చేసి తాను గద్దెనెక్కుతాడు. ఇక ఎన్టీఆర్ మళ్ళీ పోరాడి సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంటాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ సెకండాఫ్ లో ఆ ట్విస్ట్ ని ఎదుర్కొనేందుకు ఎన్టీఆర్ చేసిన సాహసాల కన్నా చంద్రబాబు చేసిన ప్రయత్నాలే హైలెట్ గా కనపడతాయి. 

ఒకవైపు ఎన్టీఆర్ ఢిల్లీతో పోరాడుతుంటే పార్టీని.. పార్టీ ఎమ్మెల్యేలు చెదిరిపోకుండా చంద్రబాబు వాళ్ళను ఢిల్లీకి తీసుకువెళ్లడం.. అక్కడ నుండి బెంగుళూరుకు లాంటి తరలించడం లాంటి వ్యూహాత్మక నిర్ణయాలతో చంద్రబాబుని హీరోగా ఈ సినిమాలో చూపించారు. ట్రైన్‌లో తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఢిల్లీ తరలిస్తున్న సీన్‌లో విలన్‌‌లతో చంద్రబాబు ఫైటింగ్‌కి దిగిన సీన్‌ని బట్టి ఆయన పాత్రని మహానాయకుడులో ఏ రేంజ్‌లో హైలెట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు పాత్ర మహానాయకుడి సినిమాకి మళ్ళీ మైనస్ లాగే కనబడుతుంది.

NTR Mahanayakudu Movie Talk at Public:

NTR Mahanayakudu Movie First Report
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs