Advertisement
Google Ads BL

న్యాయం ఎవరికైనా న్యాయమే కదా నాగబాబూ?


ఈమధ్య మెగాబ్రదర్‌ నాగబాబు బాగా రెచ్చిపోతున్నాడు. చంద్రబాబునాయుడు, లోకేష్‌, జగన్‌లపై సెటైర్లు పేలుస్తున్నాడు. దీని కోసమే ఈయన నా ఇష్టం అంటూ యూట్యూబ్‌ చానెల్‌ని కూడా పెట్టారు. తాజాగా ఆయన పలు విషయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఓ వీడియోను పెట్టాడు. అందులో బాలానంద మహరాజ్‌ అనే స్వామిని రైజింగ్‌రాజు, దొరబాబు అనే శిష్యులు పలు ప్రశ్నలు వేస్తుంటే వాటిని బాలానంద మహరాజ్‌ సమాధానాలు ఇచ్చిన తీరు అందరినీ నవ్వించేస్తోంది. ఇంతకీ ఈ ప్రశ్నలు, సమాధానాలు ఇలా ఉన్నాయి. 

Advertisement
CJ Advs

‘బయోపిక్‌ అంటే ఏమిటి స్వామీ?’.. ‘ఎలక్షన్ల కోసం చేసే ట్రిక్‌నే బయోపిక్‌ అంటారు నాయనా’.. ‘పప్పు అంటే ఎవరు స్వామీ?’.. ‘తను ఒకటి మాట్లాడాలనుకుంటే దేవుడు ఆయన చేత మరోటి మాట్లాడిస్తాడు. తననే పప్పు అంటారు నాయనా..’.. ‘ఒక విషయంలో పూర్తి అవుతుందనే మాట తప్ప.. ఎప్పటికీ పూర్తి కానిది ఏది స్వామీ?’.. ‘పోలవరం ప్రాజెక్ట్‌ నాయనా’.. ‘తీర్ధయాత్రలకు, పాదయాత్రలకు తేడా ఏమిటి స్వామీ..?’.. ‘తీర్ధయాత్ర అంటే దేవుడిని టార్చర్‌ పెట్టడం, పాదయాత్ర అంటే జనాలను టార్చర్‌ పెట్టడం నాయనా..’.. ‘అభివృద్దికి ఆందోళనకి తేడా ఏమిటి స్వామీ?’.. ‘పథకాలను ఐదు సంవత్సరాల నుంచి అమలు చేస్తే అభివృద్ది.. అదే ఐదు నెలల ముందు అమలు చేస్తే దానిని ఆందోళన అంటారు నాయనా?’.. ‘జర్నలిస్ట్‌కి, శాడిస్టుకి మధ్య ఉన్న తేడా ఏంటి స్వామీ?’.. ‘జనాలను సపోర్ట్‌ చేసే వాడిని జర్నలిస్ట్‌ అంటారు. కులాన్ని సపోర్ట్‌ చేసే వాడిని శాడిస్టు అంటారు నాయనా’ అనే ప్రశ్న జవాబులు చాలా బాగున్నాయి. 

ఇక నాగబాబు తాజాగా ఈటీవీలో తాను జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ‘జబర్ధస్త్‌’ షోపై కూడా కామెంట్స్‌ చేశాడు. ఆయన మాట్లాడుతూ, ‘జబర్ధస్త్‌’ షోలో చమ్మక్‌చంద్ర వేసే స్కిట్స్‌లో మాత్రమే కాస్త అడల్ట్‌ కంటెంట్‌ ఉంటుంది. ఆ తరహాలో నటించడం చమ్మక్‌చంద్ర స్టైల్‌. మిగతా వారి స్కిట్స్‌లో ఎక్కడా అసభ్యత కనిపించదు. వాళ్లంతా వాళ్ల స్టైల్‌లోనే స్కిట్స్‌ చేసుకుంటూ వెళ్తుంటారు. కొందరు విమర్శిస్తున్నట్లు ‘జబర్ధస్త్‌’ అనేది చూడటానికి వీలు లేని భయంకరమైన షో ఏమీ కాదు. అసభ్యతతో నిండిన ఎన్నో కార్యక్రమాలు.. థియేటర్లలో వచ్చే బూతు సినిమాలతో పోల్చుకుంటే ‘జబర్ధస్త్‌’ నథింగ్‌ అని చెప్పుకొచ్చాడు. 

ఇక తాజాగా వైసీపీ నాయకుడు, కమెడియన్‌ పృథ్వీ తనకు నాగబాబు సోదరుడు వంటి వాడని, ఆ చనువుతోనే ఓరేయ్‌.. అరేయ్‌ అనుకుంటూ ఉంటామని చెప్పాడు. నిజమే.. కానీ నాగబాబు ‘జబర్ధస్త్‌’ షోలో ఎక్కువగా ఇతర హీరోలను, స్టార్స్‌ని అనుకరించే సీన్స్‌, వారిని ఎద్దేవా చేసేవి ఉంటాయి. మరి అలాంటి సెటైర్లనే మెగా హీరోలపై వేస్తే నాగబాబు ఒప్పుకుని, అంతే స్వచ్చంగా నవ్వగలరా? లోకేష్‌ పప్పునే.. ఎవరు కాదనడం లేదు. కానీ ఇటీవల పవన్‌ ప్రసంగాలలో ఎన్నో తప్పులు వస్తున్నాయి. మరి ఆయన్ని ఏమంటారో కూడా నాగబాబు చెబితే సమన్యాయం పాటించిన వాడవుతాడని చెప్పాలి. మొత్తానికి ‘జబర్ధస్త్‌’ అనేది మెగాభిమానుల షోగా మారిందనే విమర్శలను ఇకనైనా నాగబాబు గుర్తుంచుకుంటే మంచిది. 

NagaBabu Shocking Comments on Jabardasth:

Actor Nagababu Latest Interview 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs