Advertisement
Google Ads BL

మళ్ళీ ఈ నిర్మాతతోనే మహేష్ మూవీ


మహర్షి సినిమా తరువాత మహేష్, సుకుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలి కానీ అది సెట్ అవ్వలేదు. సుకుమార్ స్టోరీ ఇంకా ఫైనల్ అవ్వలేదు. రీసెంట్ గా సుకుమార్ కొంత టైం కావాలి అని అడగడంతో తెరపైకి అనిల్ రావిపూడి వచ్చాడు. ఆయన ఇటీవలే మహేష్‌కు ఓ స్టోరీ వినిపించాడు. స్టోరీ విన్న మహేష్ వెంటనే ఓకే చేసాడట. త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement
CJ Advs

అయితే ఈ ప్రాజెక్ట్‌కి మొదటి నుండి అనిల్ సుంకరనే నిర్మాత. కానీ రీసెంట్‌గా ఈ మూవీ నిర్మాత దిల్ రాజు భాగస్వామ్యం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య మాటలు జరిగినట్లు బోగట్టా. మొన్నటివరకు అనిల్ సుంకర ఒక్కడే నిర్మాత అనుకున్నారు. కానీ ఇప్పుడు పార్టనర్ కింద దిల్ రాజు చేరాడు.

మూడో బ్యానర్ కింద మహేష్ బాబు బ్యానర్ వుంటుందా? వుండదా? అన్నది ఇంకా తెలీదు. అనిల్ ప్రస్తుతం తన టీమ్‌తో స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ అయిపోయారు. మహేష్, మహర్షి తరువాత నెల గ్యాప్ తీసుకుని అనిల్‌తో సినిమా చేయనున్నాడు.

Once Again Mahesh Babu Movie With This Producer:

Dil Raju Entered For Mahesh And Anil Ravipudi Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs