Advertisement
Google Ads BL

రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఈ హీరో ఫిల్మ్‌తోనే!


రేణుదేశాయ్‌.. ఈమె పేరు తెలియనివారు ఉండరు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా, ఎడిటర్‌గా పని చేసింది. ఈమె తెలుగులో పవన్‌కళ్యాణ్‌ ‘బద్రి, జానీ’ చిత్రాలలో నటించింది. పవన్‌కళ్యాణ్‌కి భార్యగా మెగాభిమానులందరు వదినమ్మ అని పిలిచేవారు. కానీ పవన్‌తో వైవాహిక బంధం పెటాకులైన తర్వాత ఈమె పూణెకి వెళ్లిపోయింది. మరాఠీలో ‘ఇష్క్‌వాలా లవ్‌’ చిత్రం తీసింది. 

Advertisement
CJ Advs

ఇక సీనియర్‌ హీరోయిన్లు పెళ్లి తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకోవడం, పిల్లలు పుట్టి పెద్దయిన తర్వాత మరలా సినిమాలలోకి వదిన, అమ్మ, అక్క పాత్రలతో రీఎంట్రీ ఇవ్వడం సహజంగా జరుగుతున్నదే. ప్రస్తుతం అదే కోవలోకి రేణుదేశాయ్‌ కూడా వస్తోంది. ప్రస్తుతం తెలుగులో కూడా బయోపిక్‌ల హవా సాగుతోంది. త్వరలో ‘దొంగాట’ ఫేమ్‌ వంశీకృష్ణ ఓ బయోపిక్‌ని తెరకెక్కించనున్నాడు. 1980ల కాలంలో స్టువర్ట్‌పురంకి చెందిన టైగర్‌ నాగేశ్వరరావు బహుశా ఈ తరానికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన బడా గజదొంగ. ధనవంతులను కొల్లగొట్టి పేదలకు పంచే రాబిన్‌హుడ్‌గా పేరు తెచ్చుకున్నాడు. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ఆయన చివరకు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. 

ఆయన జీవితం ఆధారంగా త్వరలో ‘టైగర్‌’ చిత్రం రానుంది. మొదట ఇందులోని టైగర్‌ నాగేశ్వరరావు పాత్రకి దగ్గుబాటి రానాని ఎంచుకున్నారు. కానీ ఎందుకో రానాతో ఈ చిత్రం పట్టాలెక్కలేదు. దాంతో దర్శకుడు వంశీకృష్ణ ఈ స్టోరీని బెల్లంకొండ హీరో సాయిశ్రీనివాస్‌కి చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఇందులో టైగర్‌ నాగేశ్వరరావు అక్క పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, కీలకంగా ఉంటుందట. 

దాంతో ఆ పాత్రను చేయమని రేణుదేశాయ్‌ని అడిగారని, ఆమె కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఈ చిత్రం సంచలనంగా మారడం ఖాయమనే చెప్పాలి. ఇలా అయితే మరలా మెగాభిమానులు తమ వదినమ్మని త్వరలో వెండితెరపై చూసే చాన్స్‌ ఉందనే చెప్పాలి. 

Renu Desai Confirms her re-entry in Tollywood:

Renu Desai re-entry with Bellamkonda Sai Srinivas film  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs