Advertisement
Google Ads BL

నాని పడేస్తున్నాడుగా అందర్నీ..!


నేచురల్‌స్టార్‌ నాని.. ఎలాంటి ఫిల్మ్‌బ్యాగ్రౌండ్‌ లేకుండా నేచురల్‌స్టార్‌ స్థాయికి ఎదిగాడు. తన కెరీర్‌లో ఎన్నోసార్లు పడి లేచిన కెరటం ఆయన. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. కిందటి ఏడాది ‘కృష్ణార్జునయుద్దం, దేవదాస్‌’ నిరాశపరిచినా కూడా దాని ముందు వరకు వరుస విజయాలు సాధించాడు. మన పక్కింటి కుర్రాడిగా, నటనలో సహజత్వం చూపించే ఆయనకు అంతకు ముందు వరకు వరుస విజయాలు వచ్చాయి. నానితో సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన క్రికెట్‌ ప్లేయర్‌ కావాలని ఆశపడి, కష్టపడే మధ్య వయస్కుని పాత్రలో ‘జెర్సీ’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం టీజర్‌కి మంచి స్పందన లభించింది. ‘మళ్లీరావా’ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరు దర్శకుడు కాగా శ్రద్దాశ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మరో పెద్ద ఆకర్షణ ఏమిటంటే కోలీవుడ్‌ నెంబర్‌ వన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ‘అజ్ఞాతవాసి’తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయన ద్వితీయ విఘ్నాన్ని దాటాలని భావిస్తున్నాడు. ఈ మూవీని తమిళంలో కూడా విడుదల చేయనున్నారు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే ఇటీవల అమేజాన్‌ సంస్థ సినిమాలు ఇంకా థియేటర్లలో ఆడుతున్నప్పుడే  స్ట్రీమింగ్‌లో ఉంచుతున్నాయి. ఒకనాడు రెండు నెలల నుంచి నేడు రెండు వారాలకే అమేజాన్‌ వంటి వాటిల్లో ఈ చిత్రాలు వస్తున్నాయి. ‘రంగస్థలం, ఎఫ్‌ 2’ చిత్రాల విషయంలో ఇదే జరిగింది. తమిళంలో ‘96’ది కూడా అదే పరిస్థితి. దాంతో ‘జెర్సీ’ చిత్ర విజయంపై ఎంతో ధీమాగా ఉన్న నాని తన నిర్మాతలతో ఈ చిత్రం విడుదలైన మూడు నెలలు పాటు అంటే దాదాపు 100రోజులు స్ట్రీమింగ్‌లో పెట్టకూడదని ఒత్తిడి తెచ్చి ఒప్పించాడట. 

మరోవైపు నాని ‘జెర్సీ’ తర్వాత తన 24వ చిత్రంగా విక్రమ్‌ కె.కుమార్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయనది రోమియో పాత్ర అని తెలుస్తోంది. ఇక 25వ చిత్రాన్ని దిల్‌రాజుతో కలిసి తాను కూడా భాగస్వామిగా ఉండి తనతో ‘అష్టాచెమ్మా, జెంటిల్‌మేన్‌’ చిత్రాలు తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఇది బాలీవుడ్‌లో షారుఖ్‌ని స్టార్‌ని చేసిన ‘బాజీఘర్‌, డర్‌’ చిత్రాల తరహాలో ఉంటుందిట. ఇందులో నాని నెగటివ్‌ షేడ్స్‌ ఉండే పాత్రని చేస్తుండగా, ‘సమ్మోహనం’ తర్వాత ఇంద్రగంటితో సుధీర్‌బాబు మరోసారి జత కట్టనున్నాడు. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రని సుధీర్‌బాబు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి నాని ఈసారి దేనికదే వైవిధ్యంతో నిండిన పాత్రలను ఎంచుకుంటూ ఉన్నాడు. 

Hero Nani in Full Swing:

Nani Planned One More Movie with Indraganti
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs