Advertisement
Google Ads BL

మహేష్ బాబుకు మరో షాక్..!


మహేష్ బాబు సూపర్ స్టార్ గా సినిమాల్లోనే చక్రం తిప్పడం లేదు... బిజినెస్ లోను మహేష్ బాబు దూసుకుపోతున్నాడు. తాజాగా మహేష్ బాబు ఏషియన్ సునీల్ తో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా ప్రారంభించాడు. ఇప్పటికే హైదరాబాద్ నగర నడిబొడ్డున AMB సినిమాస్ అంటూ మహేష్ మాల్టోప్లెక్స్ ని ఓపెనింగ్ కూడా చేసేసాడు. ఆ మల్టీప్లెక్స్ థియేటర్ లో షాపింగ్ మాల్స్  కూడా ఉన్నాయి. ఇక అక్కడ కేవలం సినిమా ప్రదర్శనే కాదు.. చాలా సినిమాల చిత్ర బృందాలు తమ సినిమా ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళుతున్నాయి కూడా. ఇక మహేష్ బాబు హైదరాబాద్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య పట్టణాల్లో ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ ని సునీల్ తో కలిసి విస్తరిస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా మహేష్ బాబు AMB సినిమా ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అదేమిటంటే... జీఎస్టీ అధికారులు ఈ AMB మల్టీప్లెక్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ ఇచ్చారని... జిఎస్టీలో టికెట్స్ ధరలు తగ్గినప్పటికీ..  సినిమా థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల నుంచి  టికెట్లకు పాత జీఎస్టీ ప్రకారం ఎక్కువ సొమ్ము వసూలు చేస్తుండడంతో జీఎస్టీ అధికారులు AMB సినిమాస్ కి నోటీసులు ఇచ్చారట. 100కు పైగా ధర ఉన్న టికెట్‌పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దానితో ఆటోమాటిక్ గా సినిమా టికెట్ల ధరలు కూడా తగ్గాయి. కానీ మహేష్ AMB సినిమాస్ వారు మాత్రం ప్రేక్షకుల నుండి 28 శాతం జిఎస్టీతో ఉన్న టికెట్స్ ని విక్రయిస్తుండడంతో.. జీఎస్టీ అధికారులు AMB మాల్ కి వచ్చి నోటీసులు ఇచ్చినట్లుగా వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.

కానీ ఏషియన్ సునీల్ మాత్రం అలాంటిదేం లేదు.. జీఎస్టీ అధికారులు టికెట్స్ ధరలపై మాకేమి నోటీసులు ఇవ్వలేదంటున్నాడు. జీఎస్టీ అధికారులు తనిఖీ చేసిన మాట వాస్తవమేనని… నోటీసులు మాత్రం ఇవ్వలేదని చెబుతున్నాడు. మరి మీడియాలో మాత్రం మహేష్ AMB సినిమాస్ కి జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చారనే న్యూస్ ప్రముఖంగా ప్రసారం అవుతుంది.

AMB Cinemas: GST Officials Serve Show Cause Notice:

Mahesh Babu Gets Another GST Shock  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs