టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక వార్త హల్ చల్ చేస్తుంది. నటుడిగా తనకంటూ సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో అడివి శేష్ కి సంబంధించి వార్త వైరల్ అవుతుంది. గత రెండు రోజులు నుండి ఈ వార్త సోషల్ మీడియాలో దుమారం లేపుతుంది. త్వరలోనే అడివి శేష్ అక్కినేని వారి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట.
అది కూడా నాగార్జున మేనకోడలు, అలనాటి హీరోయిన్ సుప్రియను మ్యారేజ్ చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సినిమాతో పరిచయం అయిన సుప్రియ ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ పనులు చూసుకోవడం స్టార్ట్ చేసింది.
అయితే రీసెంట్ గా ‘గూఢచారి’ సినిమాలో అడవి శేష్ రిక్వెస్ట్ చేయడంతో స్పై క్యారెక్టర్‌లో నటించింది సుప్రియ. వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తుంది. అంతేకాదు వీళ్ల ప్రేమను పెద్దల వరకు తీసుకెళ్లడానికి అన్నీ తానై వ్యవహరించిందట సమంత. వచ్చే నెలలో అడివి శేష్ పెద్ద అనౌన్స్‌మెంట్ చేయబోతున్నానంటూ రీసెంట్ గా ట్వీట్ చేయడంలో బహుశా పెళ్లివార్తేనని అనుకుంటున్నారు. అయితే అడివి శేష్ మాత్రం అలాంటిదేమీ లేదు అంటున్నాడు