Advertisement
Google Ads BL

శంకర్ నిర్ణయంతో ‘ఇండియన్ 2’కు కష్టాలు


దర్శకుడు శంకర్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిదనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ తాను తీసే సినిమాకి విపరీతమైన బడ్జెట్ ని నిర్మాతలతో పెట్టిస్తాడు. నిర్మాతలు కూడా శంకర్ ఎంతడిగితే అంత పెట్టేస్తారు. అందుకే లైకా ప్రొడక్షన్ వారు 2.ఓ సినిమాకి శంకర్ అడగడంతోనే 500 కోట్లపైనే పెట్టేసారు. పాపం 2.ఓ సినిమా మాత్రం చివరికి నిర్మాతలకు 100 కోట్ల నష్టాలే మిగిల్చింది. 2.ఓ సినిమా ఫైనల్ రన్ లో 100 కోట్ల నష్టాలొచ్చాయని... అందుకే లైకా ప్రొడక్షన్స్ వారు ప్రస్తుతం శంకర్ మీద భారీగా ఇన్వెస్ట్ చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
CJ Advs

ప్రస్తుతం శంకర్, కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతుంది. లైకా వారు ఇండియన్ 2 ని కూడా భారీగానే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చిత్రీకరణలో ఉన్న ఇండియన్ 2 గురించిన ఒక న్యూస్ ఇప్పుడు మీడియాలో హైలెట్ అయ్యింది. బడ్జెట్ విషయంలో డైరెక్టర్- నిర్మాత మధ్య విభేదాలు తలెత్తినట్టు దాని కారణంగా ఇండియన్ 2 షూట్‌కి బ్రేక్ పడినట్లుగా కోలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. 2.ఓ కి కావాల్సినంత పెట్టి నిర్మించామని... కానీ 100 కోట్ల లాస్ వచ్చేదని.. అందుకే ఇండియన్ 2 ని తక్కువ అంటే మీడియం బడ్జెట్ లో నిర్మిద్దామని.. శంకర్ కి చెప్పారట.

కానీ దర్శకుడు శంకర్ మాత్రం ససేమిరా అంటున్నాడట. తక్కువ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తే... క్వాలిటీ దెబ్బ తింటుందని శంకర్ వాదనగా చెబుతున్నారు. దీంతో లైకా వారికి శంకర్ కి ఆమధ్య విభేదాలు తలెత్తడంతో... ఇండియన్ 2 షూటింగ్ బ్రేకిచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే శంకర్ మాత్రం వేరే నిర్మాతల కోసం ట్రై చేస్తున్నట్లుగా వినికిడి. ఒకవేళ ఇండియన్ 2 కి కొత్త నిర్మాత దొరికితే.. ఆ సినిమా మళ్ళీ పట్టాలెక్కుతోంది. లేదంటే లేదు. మరి దీన్నిబట్టి శంకర్ కి నిర్మాతల విషయమై సెగ మొదలైనట్లుగా కనబడ్డం లేదు. 

Budget Problems to Indian 2:

Director Shankar wants High Budget to Indian 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs