Advertisement
Google Ads BL

బాలయ్య.. వాళ్ల నోళ్లు మూయిస్తాడా?


బాలకృష్ణ ఎన్‌బికె ఫిలిమ్స్ అంటూ బ్యానర్ పెట్టి మరీ నిర్మాతగా సినిమాలు తియ్యడం మొదలుపెట్టాడు. మొదటగా తన తండ్రి బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడిని ఆ బ్యానర్ మీదే తెరకెక్కించాడు. ఎన్‌బికె ఫిలిమ్స్ బ్యానర్‌లో తెరకెక్కిన మొదటి సినిమా కథానాయకుడు బాలయ్య బాబుకి భారీ షాకిచ్చింది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలకృష్ణ బాగానే ఖర్చు పెట్టాడు. ఎక్కడా తగ్గకుండా కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను నిర్మించాడు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులలో నటించడానికి మంచి అంటే కాస్ట్లీ నటులనే తీసుకొచ్చాడు. అందులో బాలీవుడ్ నుండి కూడా విద్యాబాలన్‌ని తీసుకొచ్చాడు.

Advertisement
CJ Advs

బసవతారకం కేరెక్టర్ కోసం బాలకృష్ణ, విద్యాబాలన్ ని ఎంపిక చెయ్యగా ఆమె తెలుగులో నటించేందుకు బాలయ్యని ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేసిందట. అలాగే సినిమాలో తన సీన్స్ కూడా ఎక్కువ ఉండాలనే షరతు మీదే ఆమె ఎన్టీఆర్ బయోపిక్ లో నటించింది అనే టాక్ ఆమె ఎన్టీఆర్ బయోపిక్ కి సైన్ చేసినప్పటి నుండే నడుస్తుంది. మరి కథానాయకుడు సినిమాలో విద్యాబాలన్ బసవతారకంగా అదరగొట్టే పెరఫార్మెన్స్ ఇచ్చింది. బాలయ్య, విద్యని బసవతారకం కేరెక్టర్ కి తీసుకోవడం 100 శాతం కరెక్ట్ అన్నారు అంతా. తాజాగా కథానాయకుడు లాస్ అవడంతో.. బాలయ్య అనవసరంగా విద్యాబాలన్ కోసం 2 కోట్లు తగలేసాడంటూ వార్తలు రాస్తున్నారు

ఆ కేరెక్టర్ కి బాలీవుడ్ నుండి విద్యని కాకుండా ఇక్కడే ఎవరో ఒకరిని పెట్టేసినట్లైతే.. లక్షల్లో పారితోషకం ఉండేది.. అనవసరంగా విద్యని తీసుకుని బాలయ్య కోట్లు ఖర్చుచేశాడంటున్నారు. మరి విద్యాబాలన్ బసవతారకంగా నటనలోనూ, అభినయంలోనూ అదరగొట్టినా.. కథానాయకుడు సినిమా డిజాస్టర్ దృష్ట్యా ఇప్పుడు అంత పెట్టి విద్యని తీసుకురాకుండా ఉంటే.. నష్టం వచ్చిన మొత్తంలో కొంత మిగిలేది... బాలయ్య బాలీవుడ్ హీరోయిన్ మీదున్న డ్రీమ్స్ వలన కోట్లు పోశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రాబోయే శుక్రవారం విడుదల కాబోతున్న మహానాయకుడు సినిమాలో కూడా బసవతారకం హైలెట్ అవుతుందని మహానాయకుడు ట్రైలర్‌లో కనబడుతుంది. మరి మహానాయకుడు హిట్ అయితే గనక ఇప్పుడు లేచిన నోర్లు అప్పుడు మూతబడే అవకాశం ఉంది.

Comments on Balakrishna About NTR Biopic Basavatarakam Role :

Netizens Targets Balakrishna on Vidya Balan Remuneration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs