ఎన్టీఆర్ బయోపిక్ మొదలైంది మొదలు సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని స్వయంగా బాలకృష్ణే.. సాయి కొర్రపాటి, విష్ణుతో కలిసి నిర్మించాడు. మరి అదే అంచనాలతో భారీ క్రేజ్ మధ్య కథానాయకుడు భారీగా బిజినెస్ జరుపుకుంది. సినిమా విడుదలకు ముందుగా అంటే సినిమా మొదలైనప్పటి నుండే కథానాయకుడు ప్రమోషన్స్ పీక్స్ లో ఉంచారు క్రిష్ అండ్ బాలయ్యలు. అందుకే సినిమా విడుదల సమయానికి కథానాయకుడుపై భారీ అంచనాలు కాదు.. కాదు ఆకాశాన్నంటే క్రేజ్ తో సినిమా విడుదలైంది. మొదటి రోజు సూపర్ హిట్ అన్న ప్రేక్షకులు.. తర్వాతి రోజే పెదవి విరిచారు. కథానాయకుడు సూపర్ హిట్ అన్న వారే... మరుసటి రోజుకు మాట మార్చేశారు. అంతే దెబ్బకి కథానాయకుడు ఢమాల్.
ఇక కథానాయకుడు సూపర్ హిట్ అయితే వెంటనే రెండో పార్ట్ మహానాయకుడుని ఒక నెల గ్యాప్ లో విడుదల చేద్దామనుకుంటే.. కథానాయకుడు దెబ్బకి మహానాయకుడికి మళ్లీ రిపేర్లు చేసి ఎలాంటి చప్పుడు లేకుండా రాబోయే శుక్రవారం విడుదలకు సిద్ధం చేశారు క్రిష్ అండ్ బాలకృష్ణలు. మహానాయకుడుపై ఎలాంటి అంచనాలు లేవు. అలాగే ఎలాంటి హైప్ లేదు. మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో అర్ధమే కానీ పరిస్థితి. తాజాగా విడుదల చేసిన మహానాయకుడు ట్రైలర్ కూడా ఎలాంటి ఉత్సహాన్ని ప్రేక్షకుడిలో నింపలేదు. అసలు మహానాయకుడు ట్రైలర్ ట్రెండింగ్‌లో లేదంటేనే పరిస్థితి అర్ధమవుతుంది.
అయితే ఇలా సినిమా మీద అంచనాలు పెంచేసి.. తర్వాత సినిమా విషయంలో తేడా కొడితే.. ప్రాబ్లెమ్ అవుతుందనే.. మహానాయకుడు టీం.. ఇలా పెద్దగా ప్రమోషన్స్ గట్రా చెయ్యడం లేదనేది ఇన్ సైడ్ టాక్. కథానాయకుడు అంచనాలతో పోలిస్తే మహానాయకుడుగా అంచనాలు 0. అందుకే ఎలాంటి హైప్, ఎలాంటి క్రేజ్ లేకపోతే.. ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు పెట్టుకోరు. ఓపెన్ మైండ్‌తో మూవీకి వస్తారు.. ఒక వేళ కంటెంట్ బావుంటే హిట్ అవుతుంది. లేదంటే ప్రేక్షకులు కూడా నార్మల్‌గా ఉంటారు. లేదంటే భారీ అంచనాలతో థియేటర్‌కి వస్తే సినిమా అంచనాలను అందుకోకపోతే.. నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి.... డ్యామేజ్ వీరలెవల్లో ఉంటుందని... అలాంటి పరిస్థితి ఎందుకులే అనే మహానాయకుడు ప్రమోషన్స్ ని చిత్ర బృందం లైట్ తీసుకుందనిపిస్తుంది. మరోపక్క పాత బయ్యర్లకి సినిమాని ఇచ్చేశాం గనక.. మళ్ళీ ప్రమోషన్స్‌కి అదనంగా ఖర్చెందుకు అని బాలయ్య అండ్ కో భావించబట్టే ప్రమోషన్స్ వీక్ అయ్యాయంటున్నారు.