ప్రస్తుతం టాలీవుడ్ లో బోయపాటి - దానయ్యల విభేదాలు హాట్ హాట్ గా ప్రసారంలో ఉన్నాయి. చరణ్ క్షమాపణ లెటర్ గురించిన హాట్ హాట్ చర్చలు ముగిసినా... బోయపాటి వ్యవహారంపై మీడియాకి ఇంతవరకు క్లారిటీ రాలేదు. మరి వినయ విధేయ రామ ప్లాప్ పై బోయపాటి మాటేమిటి? అసలు తన పారితోషకంలో ఎంత వెనక్కి ఇచ్చాడు అనేదానిపై కూడా స్పష్టత లేదు. దానయ్య, చరణ్ లు మాత్రం కొంతమొత్తం డిస్ట్రిబ్యూటర్స్ కి సర్దేసారు. ఇక బోయపాటి అధిక బడ్జెట్ వలనే వినయ విధేయ రామ డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారని... అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తయ్యి ఉంటే.. అంత నష్టం వచ్చేది కాదనేది నిర్మాతల వాదన. ఇక బాలకృష్ణ సినిమాకైనా బోయపాటిలో మార్పొస్తుందని అందరూ ఎక్సపెక్ట్ చేశారు.
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా ఎన్ బీ కె ఫిలిమ్స్ లో సినిమా మొదలవ్వాల్సి ఉంది. ఆ సినిమాకి కూడా 70 నుండి 75 కోట్ల బడ్జెట్ తో కథని తయారు చేసాడట బోయపాటి. కథానాయకుడు దెబ్బకి బాలకృష్ణ 70 కుదరదని చెప్పగా.. సరే 50 లోపే చెయ్యడానికి శతవిధాలా ప్రయత్నిస్తానని బోయపాటి, బాలయ్యకి మాటిచ్చినట్లుగా ఫిలింనగర్ టాక్. ఇక బాలయ్య మాటను బోయపాటి వినాల్సిన పరిస్థితుల్లో ఉన్నదనేది నేటి వాస్తవం. తాజాగా మరోసారి బాలయ్య మాటను బోయపాటి వినాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఒక వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. బోయపాటి ఒక విషయమై బాలయ్యని సంప్రదించగా.. మొహమాటం లేకుండా కుదరదని చెప్పేశాడట.
ఇంతకీ బోయపాటి అడిగిన విషయం ఏమిటంటే... బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయక సినిమా చేసేటప్పుడు భారీగా మాదాపూర్ లోను ఒక నాలుగంతస్తుల బిల్డింగ్ ని తన ఆఫీస్ కోసం తీసుకున్నాడట. ఇక జయ జానకి నాయక నిర్మాతలు ఆ బిల్డింగ్ అద్దె ఖర్చులు, మెయింటినెన్స్ అన్ని భరించారట. ఇక ఆ బిల్డింగ్ నే వినయ విధేయ రామకి బోయపాటి ఉంచేసాడట. ఇక వినయ విధేయ రామ నిర్మాత దానయ్య అప్పుడు ఆ బిల్డింగ్ ఖర్చులు భరించాడట. కానీ జయ జానకి నాయక, వినయ విధేయ రామ సినిమాలు పోయినా... నిర్మాతలకు భారీ నష్టాలొచ్చినా.. బోయాపాటికి ఆ నాలుగంతస్తుల బిల్డింగ్ బాగా కలిసొచ్చింది. అందుకే ఇప్పుడు బాలయ్యా సినిమా కోసం కూడా దాన్ని కంటిన్యూ చేద్దామనుకుంటే... ఆ సినిమా బాలయ్య ఎన్ బీ కె ఫిలిమ్స్ లో నిర్మిస్తున్నారు కాబట్టి... బాలకృష్ణని ఆ నిర్మాణ సంస్థలోని భాగస్వాములైన నిర్మాతలను అడగగా... వారు బోయటికి నో చెప్పడమే కాదు ... ఎలాగూ మన ఆఫీస్ ఉందిగా వాడుకోమని ఉచిత సలహా పడేశారట. పాపం బోయపాటి అనిపిస్తుంది కదూ...!!