Advertisement
Google Ads BL

రాజ్ కందుకూరి త‌న‌యుడి స్పీడ్ చూశారా?


రెండో సినిమాకు సైన్ చేసిన శివ కందుకూరి.. 

Advertisement
CJ Advs

పెళ్లి చూపులు సినిమాతో జాతీయ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న నిర్మాత రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు. మొద‌టి చిత్రం ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ వ‌ర‌కు మొత్తం షూటింగ్ పూర్తి కానుంది. స‌మ్మ‌ర్ త‌ర్వాత విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. శేష సింధు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ 96 చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించిన వ‌ర్ష బొల్ల‌మ్మ‌ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. తొలి చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే అప్పుడే రెండో సినిమాకు సైన్ చేసారు శివ కందుకూరి. ఫిబ్ర‌వ‌రి 18న శివ కందుకూరి పుట్టిన రోజు సంద‌ర్భంగా అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఆపిల్ ట్రీ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై నరాల శ్రీ‌నివాస్ రెడ్డి, పుత్తాక‌ర్ రోన్ స‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాకు అజ‌య్ భూప‌తితో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన భ‌ర‌త్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎప్రిల్ నుంచి ఈ ప్రేమ‌క‌థ ప‌ట్టాలెక్క‌నుంది. గోపీసుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శివ కందుకూరి తొలి సినిమాకు కూడా గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. 

న‌టీన‌టులు: 

శివ కందుకూరి 

సాంకేతిక నిపుణులు: 

ద‌ర్శ‌కుడు: భ‌ర‌త్ 

నిర్మాత‌లు: న‌రాల శ్రీ‌నివాస్ రెడ్డి, పుత్తాక‌ర్ రోన్ స‌న్ 

బ్యాన‌ర్: ఆపిల్ ట్రీ ఎంట‌ర్ టైన్మెంట్ 

సంగీతం: గోపీ సుంద‌ర్

Shiva Kandukuri Signs His Second Film:

Producer Raj Kandukuri of ‘Pelli Choopulu’ Fame Son Shiva Kandukuri is Making His Screen Debut
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs