Advertisement
Google Ads BL

‘మహానాయకుడు’ ట్రైలర్: విలన్ ఆయనే!


ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ నట జీవితాన్ని పూర్తిగా చూపించి... రాజకీయ జీవితంలోకి అడుగులెలా పడిందో చూపించారు దర్శక, హీరోలు. బాలకృష్ణ - క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం కథానాయకుడిని నటజీవితానికి, మహానాయకుడిని రాజకీయ జీవితానికి విభజించినట్లుగానే.... కథానాయకుడిలో ఎన్టీఆర్ నట జీవితం చూపించగా.. మహానాయకుడిలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించారు. అదే ఇప్పుడు ట్రైలర్ లో క్లియర్ గా తెలియజేసారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, ఆయన రాజకీయాల్లో ఎదగడం దగ్గరనుండి... అక్కడ పడిన ఒడిదుడుకులు, రాజకీయాలు అన్నిటిని మహానాయకుడిలో చూపించారు.

Advertisement
CJ Advs

ఇక మహానాయకుడు ట్రైలర్ లోకి వెళితే... ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రజలతో ఎలా మమేకమైంది, ప్రజలకోసం ఎలాంటి సంక్షేమ పథకాలను మొదలుపెట్టింది, కాంగ్రెస్ అధ్యక్షరాలు ఇందిరాగాంధీతో సంబంధం, ఇందిరాగాంధీ ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ కృష్ణావతారంలో ఉన్న హోర్డింగ్  చూసి దణ్ణం పెట్టుకోవడాన్ని.. ఆమె పిఎ.. ఆయన దేవుడు కాదు.. అప్పోజిషన్ పార్టీ ఎన్టీఆర్ అని చెప్పి అప్పుడు ఆమె తిన్న షాక్ అన్నిటిని హృద్యంగా చూపించారు. ఇక రాజకీయాలలో ఎన్టీఆర్ వెన్నంటి ఉండి అయనకి రాజకీయ పాటలు నేర్పిన వానిగా నాదెండ్ల భాస్కర్ రావుని, ఎన్టీఆర్ కి సలహాలు సూచనలు చేసే చంద్రబాబు పాత్రని కూడా చూపించారు. ఇక భార్య బసవతారకంకి క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ కి కుటుంబంని చూసుకో.. నేను రాజకీయాలను చూసుకుంటానని చెప్పడం, అలాగే రాజకీయాల్లో పెద్దాయనకు గ్లామర్ ఉంటే.. నా దగ్గర గ్రామర్ ఉందని చంద్రబాబుకి నాదెండ్ల చెప్పడం.. ఇంకా దగ్గుబాటితో చంద్రబాబు...చెప్పేవాడు లేకపోతే ఆరు కోట్ల మందున్నా ఎన్టీఆర్ ఒంటరైపోతాడు అని చెప్పే డైలాగ్.. నిశ్శబ్దాన్ని... చేతకాని తనం అనుకోవద్దు.. మౌనం మరణాయుధంతో సమానం అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇక చంద్రబాబు పాత్రని హైలెట్ చెయ్యకుండా.. సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు కేరెక్టర్ ని బాగా హైలెట్ చేసి ఈ మహానాయకుడి ట్రైలర్ లో చూపించారు. రానా చంద్రాబుగా, ఎన్టీఆర్ గా బాలకృష్ణ , నాదెండ్ల భాస్కర్ రావుగా సచిన్ కెద్కర్ అద్భుతంగా నటించారు. ఇక కుటుంబాన్ని ఎక్కువగా హైలెట్ చెయ్యకుండా.. కేవలం రాజకీయాలతోనే ఈ సినిమాని నింపేసారనేది ఈ ట్రైలర్ స్పష్టం చేస్తుంది. మరి వచ్చే శుక్రవారమే విడుదలకాబోతున్న మహానాయకుడు రన్ టైం కూడా చాలా తక్కువ కావడం సినిమాకి ప్లస్ కాబోతుంది. కేవలం 2గంటల 8 నిమిషాలు మాత్రమే... మహానాయకుడు రన్ టైం, అలాగే సినిమాకి సెన్సార్ వారు క్లీన్ యు సర్టిఫికెట్ ఇవ్వడం ఇలా అన్ని ఈ సినిమాకి పాజిటివ్ కనబడుతున్న అంశాలే.

Click here for NTR Mahanayakudu Trailer:

NTR Mahanayakudu Trailer Review: Mistakes Not Corrected:

NTR Mahanayakudu Trailer Review  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs